ETV Bharat / bharat

అక్టోబర్​ 26న ఖర్గే చేతికి కాంగ్రెస్​ పగ్గాలు.. మోదీ కీలక వ్యాఖ్యలు

Congress President Election 2022 : కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా అక్టోబర్​ 26న బాధ్యతలను స్వీకరించనున్నట్లు తెలిపారు ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే. ఖర్గేకు.. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీతో కలిసి ఖర్గే ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పారు.

Congress President Election 2022
Congress President Election 2022
author img

By

Published : Oct 19, 2022, 6:58 PM IST

Congress President Election 2022 : అక్టోబర్‌ 26న కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌నేత మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే ఈ మేరకు తెలిపారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా.. తాము కలిసికట్టుగా పోరాడతామని ఖర్గే స్పష్టం చేశారు. రాజ్యాంగానికి ముప్పుగా పరిణమిల్లే వాటిని అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తనతో పోటీ పడిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు, పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి, శ్రేణులకు ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు.

'ఈ విజయం ఖర్గేది కాదు.. యావత్​ కాంగ్రెస్​ది' : అధ్యక్ష ఫలితాలపై స్పందించిన శశిథరూర్‌.. ఈ విజయం ఖర్గేది కాదని యావత్‌ కాంగ్రెస్‌ పార్టీదని కొనియాడారు. ఈ ఎన్నికలు పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని అందించిందని తెలిపారు. బలమైన భారతదేశం కావాలంటే.. బలమైన కాంగ్రెస్​ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Congress President Election 2022
ఖర్గేతో సోనియా, ప్రియాంక
Congress President Election 2022
ఖర్గేకు అభినందనలు తెలియజేస్తున్న ప్రియాంక గాంధీ

ఖర్గేకు అభినందనల వెల్లువ: కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీతో కలిసి ఖర్గే ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. మల్లికార్జున ఖర్గేకు ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ఆయన అపార అనుభవం, సిద్ధాంతాలు పార్టీకి ఎదుగుదలకు సాయపడతాయన్నారు. చారిత్రక బాధ్యతలు చేపట్టిన ఖర్గే.. పార్టీకి మార్గ నిర్దేశం చేస్తారని రాహుల్‌ అన్నారు.

అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశిథరూర్‌.. ఖర్గే ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్‌ నేతలు ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మల్లికార్జు ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీ కాలం ఫలప్రదంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Congress President Election 2022
ప్రధానమంత్రి మోదీ ట్వీట్​
Congress President Election 2022
రాహుల్ గాంధీ ట్వీట్​

నా పాత్రను కొత్త అధ్యక్షుడే నిర్ణయిస్తారు : కాంగ్రెస్‌లో తన పాత్ర ఏమిటో పార్టీ కొత్త అధ్యక్షుడు నిర్ణయిస్తారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం అని.. ప్రతిఒక్కరూ ఆయనకు నివేదించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్​ ఆదోనిలో భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్‌.. మీడియాతో మాట్లాడారు. పార్టీలో రాహుల్‌పాత్ర ఏమిటనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు.. పార్టీ అధ్యక్షుడే నిర్ణయిస్తారని సమాధానం ఇచ్చారు. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఇద్దరు కూడా అనుభవంతోపాటు అవగాహన కలిగిన నాయకులని, వారికి తన సూచనలతో అవసరం ఉండదని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శశిథరూర్‌ వర్గం చేసిన ఆరోపణలపైనా స్పందించిన రాహుల్‌.. వాటిని పరిష్కరించటానికి పార్టీలో తగిన వ్యవస్థ ఉందన్నారు. ఎన్నికల సంఘం ఉన్న ఏకైక పార్టీ తమదేనన్న రాహుల్‌.. దానికి టీఎన్​ శేషన్‌లాంటి వ్యక్తి నేతృత్వం వహిస్తున్నట్లు చెప్పారు.

"పార్టీలో నా పాత్ర ఏమిటన్న విషయమై నాకు పూర్తి అవగాహన ఉంది. నా పాత్ర ఏమిటి, నేను ఏ బాధ్యతలు నిర్వహించాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిర్ణయిస్తారు. మిగతా విషయాలు మీరు ఖర్గే, సోనియాను అడగాలి. నాకు తెలిసినంత వరకు పార్టీకి సంబంధించి తుది నిర్ణయం కాంగ్రెస్‌ అధ్యక్షుడే తీసుకుంటారు. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆ పెద్దమనిషి నిర్ణయం తీసుకుంటారు."

-రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అగ్రనేత

ఇవీ చదవండి: కాంగ్రెస్​ అధ్యక్షుడిగా ఖర్గే ఘన విజయం.. ఆ సవాళ్లను అధిగమిస్తారా?

'అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు.. తెలంగాణ, యూపీ ఓట్లపై డౌట్స్​'.. థరూర్​ సంచలన ఆరోపణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.