president kanpur visit: ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి కాన్పూర్ పర్యటనకు ముందు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నగరంలో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. రెండు వర్గాలు.. పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో బాంబులు కూడా పేల్చినట్లు పోలీసులు తెలిపారు. ఒక రాజకీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఈ ఘర్షణకు కారణమని చెప్పారు.
![president kanpur visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15465505_3.jpg)
![president kanpur visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15465505_5.jpg)
![president kanpur visit](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15465505_4.jpg)
గొడవల అనంతరం రెండు వర్గాల ప్రజలు సోషల్ మీడియాలో సైతం ఘర్షణకు దిగారు. దీంతో నగరంలోని నవీన్ మార్కెట్, పరెడ్ మైదానం, యాతిమ్ఖానా, మెస్టన్ రోడ్లు మూతపడ్డాయి. ఇరు వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చదవండి: కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం అలర్ట్- తెలంగాణ సర్కారుకు లేఖ