ETV Bharat / bharat

ఇంట్లోకి చొరబడి జవానును హత్య చేసిన నక్సలైట్లు - ఛత్తీస్​గఢ్​

ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు ఓ జవానును హత్య చేశారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి ఘాతుకానికి పాల్పడ్డారు.

jawan was killed allegedly by naxals
జవాను హత్య
author img

By

Published : May 12, 2021, 10:18 AM IST

ఛత్తీస్​గఢ్​ సుక్మా జిల్లాలో దారుణానికి పాల్పడ్డారు మావోయిస్టులు. పెంటా గ్రామంలో ఇంట్లోకి చొరబడి ఓ జవానును హత్య చేశారు. అంతా నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు నక్సలైట్లు.. జవానును పొట్టనపెట్టుకున్నారు.

jawan was killed allegedly by naxals
జవాను భార్య, పిల్లలు

" మేము నిద్రిస్తున్న సమయంలో ఐదుగురు ఇంట్లోకి వచ్చారు. ఆయన తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పట్టుకున్నారు. మా ట్రాక్టర్​ తాళాలు, ఫోన్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఆ తర్వాత హత్య చేశారు. "

- జవాను భార్య

ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు ఎస్​డీఓపీ అధికారి తెలిపారు. ఇంటి నుంచి 50 మీటర్ల దూరంలో జవాను పార్థీవ దేహం ఉన్నట్లు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చూడండి: దేశంలో మరో 3.48లక్షల కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.