CBSE term-II board exams: సీబీఎస్‌ఈ బోర్డు 10, 12వ తరగతుల విద్యార్థులకు టర్మ్-2 పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 26 నుంచి థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన బోర్డు.. తాజాగా ఈ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పరీక్షల్ని ఆఫ్‌లైన్ మోడ్‌లోనే నిర్వహించనున్నట్టు బోర్డు ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ గత నెలలోనే స్పష్టంచేశారు.
పరీక్షల నిర్వహణపై రాష్ట్రాలతో చర్చించిన తర్వాత దేశంలోని కొవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సెకండ్ టర్మ్ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. సీబీఎస్‌ఈ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచిన శాంపిల్ క్వశ్చన్ పేపర్ల మాదిరిగానే పరీక్షల ప్రశ్నాపత్రం ప్యాట్రన్ ఉండనుంది.
కరోనా మహమ్మారి విజృంభణతో ఈ ఏడాది రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టర్మ్-1 పరీక్షలు పూర్తికాగా.. 10, 12వ తరగతుల విద్యార్థులకు ఏప్రిల్ 26న పరీక్షలు మొదలవుతాయని పేర్కొంది.
కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూసివేతను దృష్టిలో ఉంచుకొని రెండు పరీక్షల మధ్య గణనీయమైన వ్యవధి ఇచ్చామని ఈరోజు విడుదల చేసిన సర్క్యులర్‌లో తెలిపింది. డేట్ షీట్‌ను తయారు చేసినప్పుడు జేఈఈ మెయిన్ సహా ఇతర పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్టు బోర్డు పేర్కొంది.
సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల డేట్ షీట్
సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల డేట్ షీట్
ఇదీ చూడండి: