ETV Bharat / bharat

వ్యాక్సిన్ల్​ కోసం కెనడా ప్రధాని ఫోన్​.. మోదీ హామీ

భారత్​ నుంచి టీకాలు కావాలని కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో.. మోదీకి ఫోన్​ చేశారు. ఫలితంగా.. ఈ విషయంలో తాము అన్ని విధాలుగా సహాయం చేస్తామని మోదీ ట్రూడోకు హామీ ఇచ్చారు.

candan prime minister justin trudeau calls to indian prime minister narendra modi for corona vaccine
వ్యాక్సిన్ల్​ కోసం కెనడా ప్రధాని ఫోన్​.. మోదీ హామీ
author img

By

Published : Feb 11, 2021, 8:48 AM IST

Updated : Feb 11, 2021, 9:41 AM IST

తమకు వ్యాక్సిన్లు అందించాలని కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్​ చేశారు. ఈ క్రమంలో.. కెనడాకు భారత్​ అన్ని విధాలుగా సహాయం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తుందని ట్రూడోకు మోదీ హామీనిచ్చారు.

కరోనాపై ప్రపంచం విజయం సాధిస్తే.. అది భారత్​ వద్ద ఉన్న అపారమైన ఫార్మా సామర్థ్యం, దానిని ఇతర దేశాలకు పంచుకునే విషయంలో మోదీ నాయకత్వం వల్లేనని ట్రూడో అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని భారత ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

అదే సమయంలో కెనడాలో టీకా అవసరాల గురించి మోదీకి ట్రూడో వివరించారు. ఫలితంగా.. భారత్​ తన వంతు కృషి చేస్తుందని మోదీ ఆయనకు హామీనిచ్చారు.

"నా మిత్రుడు ట్రూడో నుంచి ఫోన్​ రావడం ఎంతో సంతోషకరం. కెనడాకు భారత టీకాలు అందించే విషయంపై ట్రూడోకు హామీనిచ్చాను. వాతావరణ మార్పు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై పరస్పర సహకారం కొనసాగించాలని ఇద్దరం అంగీకరించాము."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

రానున్న రోజుల్లో అంతర్జాతీయ వేదికలపై కలుసుకుని ఇరు దేశాల సంబంధాలపై చర్చించుకునేందుకు నేతలిద్దరు అంగీకరించారు.

ఇవీ చదవండి: 'మోదీజీ.. బహిరంగంగా టీకా తీసుకోండి'

'టీకా తీసుకునే వారికి బీమా లేదు'

సురక్షిత టీకాపై సందేహాలు- సమాధానాలు

కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియపై​ 97 శాతం మంది సంతృప్తి!

'భారత అథ్లెట్స్​కు కరోనా టీకా​ అందించాలి'

Last Updated : Feb 11, 2021, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.