ETV Bharat / bharat

'సాగు చట్టాల రద్దుకై పార్లమెంటును సమావేశపర్చండి' - పార్లమెంటు

దిల్లీ సరిహద్దుల్లో రైతులు కదం తొక్కుతున్నారు. వ్యవసాయ చట్టాలపై ఆగ్రహించిన అన్నదాతలు.. వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. ఇందుకోసం పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలని స్పష్టం చేశారు. చట్టాలను వెనక్కితీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Call special Parliament session to repeal farm laws: Farmers to govt
వ్యవసాయ చట్టాల రద్దుపై రైతుల కొత్త డిమాండ్లు
author img

By

Published : Dec 2, 2020, 6:43 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనని రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. డిసెంబర్​ 3న మరోసారి కేంద్రంతో సమావేశం కానున్న నేపథ్యంలో రైతుసంఘాల నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడానికి పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చాలని డిమాండ్​ చేశారు. మీడియా సమావేశంలో పలువురు రైతు సంఘాల నేతలు కీలక విషయాలు వెల్లడించారు.

తమ డిమాండ్లు నెరవేర్చకుంటే దిల్లీకి వెళ్లే ఇతర మార్గాలను నిర్బంధిస్తామని హెచ్చరించారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

''రైతు సంఘాలను విడగొట్టాలని కేంద్రం ప్రయత్నించింది. కానీ అది జరగదు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించేందుకు కేంద్రం.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటుచేయాలి. లేకుంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తాం.''

- దర్శన్​ పాల్​, రైతు సంఘాల నాయకుడు

వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కితీసుకోకుంటే.. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు మరో నేత గుర్నామ్​ సింగ్​ ఛదోనీ. డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, కార్పొరేట్లకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మలు దహనం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'ఖట్టర్​' ఇంటి ముట్టడికి విఫల యత్నం

ప్రెస్​ కాన్ఫరెన్స్​కు ముందు.. దాదాపు 32 రైతు సంఘాలు సింఘూ సరిహద్దు వద్ద సమావేశమయ్యాయి. భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేశ్​ టికాయిత్​ కూడా ఇందులో పాల్గొన్నారు. అనంతరం.. తమ నిర్ణయాలను వెల్లడించారు.

కేంద్రం మల్లగుల్లాలు..

మంగళవారం రైతు సంఘాలతో సమావేశమైన కేంద్రం.. డిసెంబర్​ 3న మరోసారి భేటీ కానుంది. ఈ నేపథ్యంలో.. గురువారం జరగాల్సిన సమావేశంపై కేంద్ర మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. వ్యవసాయ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఏం చేయాలోనని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​, రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​తో చర్చించారు హోం మంత్రి అమిత్​ షా.

ఇదీ చూడండి: కొలిక్కిరాని చర్చలు- కేంద్రం ప్రతిపాదనకు రైతులు నో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.