భారత్- పాకిస్థాన్ సరిహద్దు వద్ద హై అలర్ట్‌ను ప్రకటించారు అధికారులు. పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడం ఇందుకు కారణం. నిఘా వర్గాల సమాచరం ప్రకారం.. తాలిబన్ల సాయంతో పాక్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉన్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు హెచ్చరించారు.
"భద్రతాదళాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాము. పాక్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంగ్లాదేశ్ సరిహద్దులోని భద్రతాదళాలకు హెచ్చరికలు జారీ చేశాము."
-అధికారులు
జాతీయ భద్రతా సంస్థ ఎన్ఐఏ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. తాలిబన్ల సాయంతో ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడే అవకాశం ఉందని తెలిపింది.
భారీ ఉగ్ర కుట్ర భగ్నం..
దేశంలో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు దిల్లీ పోలీసులు. పాక్‌లో శిక్షణ పొందిన ఇద్దరు తీవ్రవాదులు సహా మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పండగ సీజన్లో రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడేందుకు వీరు ప్రణాళికలు రచించారని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి : భారీ ఉగ్రకుట్ర భగ్నం- ఆరుగురు అరెస్ట్