Bride Protest At Groom Home : పెళ్లికి ముందు రోజు ఓ వరుడు పారిపోయాడు. దీంతో వధువు కుటుంబం వరుడి ఇంటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
కంటూరులోని కొల్లేగల సంకనపుర కాలనీకి దివ్యశ్రీ, మహేశ్ బెంగళూరులో ఒకే కంపెనీలో ఉద్యోగం చేసేవారు. ఆ సమయంలో ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. గత ఐదేళ్లుగా వీరిద్దరూ లవ్‌లో ఉన్నారు. కొన్ని నెలల క్రితం మహేశ్‌కు పెళ్లి ప్రపోజల్ చేసింది దివ్యశ్రీ. కొద్దిగా సమయం కావాలని మహేశ్ కోరడం వల్ల దివ్యశ్రీ అందుకు నిరాకరించింది. ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే దివ్యశ్రీ తల్లిదండ్రులు పంచాయతీ పెట్టారు. అప్పుడు గ్రామ పెద్దలు దివ్యశ్రీ, మహేశ్ వివాహం నవంబరు 27న చిలకవాడి గుడిలో చేయాలని నిశ్చయించారు. అందుకు మహేశ్, దివ్యశ్రీ తల్లిదండ్రులు సైతం అంగీకరించారు.
వరుడి ఇంటి ముందు వధువు నిరసన
అయితే పెళ్లికి వధువు కుటుంబసభ్యులు నవంబరు 26న మహేశ్ గ్రామానికి వచ్చారు. అప్పటికే వరుడు మహేశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. ఈ విషయమై దివ్యశ్రీ మాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రోజుల గడుస్తున్నా మహేశ్ ఆచూకీ దొరకకపోవడం వల్ల అతడి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు దివ్యశ్రీ నచ్చజెప్పి ఇంటికి పంపించారు. త్వరలోనే మహేశ్ ఆచూకీ కనుక్కొంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
పెళ్లి మండపం నుంచి వరుడు పరార్
కొన్నినెలల క్రితం ఉత్తర్‌ప్రదేశ్ బరేలీ జిల్లాకు చెందిన ఓ వరుడు ఎన్నో ఏళ్లుగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనంటూ ఏకంగా పెళ్లి మండపం నుంచే పారిపోయాడు. ఇది తెలుసుకున్న ఆ నవవధువు ముఖం చాటేసి పారిపోతున్న అతడిని 20 కిలోమీటర్ల మేర బస్సులో వెంబడించి మరీ పట్టుకుంది. ఒక సినిమాలోని సన్నివేశంలా సాగిన ఈ ఛేజింగ్‌లో చివరకు అమ్మాయి పంతమే నెగ్గింది. ఇరు కుటుంబాల మధ్య గొడవల అనంతరం ఓ ఆలయంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెల్లవారితే పెళ్లి- ప్రేయసితో వరుడు పరార్
పెళ్లి సమయంలో వరుడు పరార్.. వెనకే పరిగెత్తిన వధువు.. చివరకు పోలీసుల జోక్యంతో..