ETV Bharat / bharat

ప్రజలను కలవని సీఎం, సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? : మోదీ

BJP Public Meeting at Toopran in Telangana : ప్రజలను కలవని సీఎం.. ఎప్పుడూ సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా అంటూ పీఎం మోదీ అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీను అధికారంలోకి తేవాలనే సంకల్పం మొదలైందని తెలిపారు. తూప్రాన్‌లో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో మోదీ పాల్గొని.. ప్రసంగించారు.

BJP Public Meeting at Toopran in Telangana

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 3:14 PM IST

Updated : Nov 26, 2023, 7:59 PM IST

BJP Public Meeting at Toopran in Telangana : తెలంగాణలో ఈసారి ఒక కొత్త సంకల్పం కనిపిస్తోందని.. బీజేపీను అధికారంలోకి తేవాలని ప్రజల్లో సంకల్పం మొదలైందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) అన్నారు. గతంలో నవంబరు 26న దురదృష్టకర ఘటన జరిగిందని.. ఆ అసమర్థ ప్రభుత్వం వల్ల నవంబరు 26న దేశంలో ఉగ్రదాడి(26/11 Mumbai Terrorist Attack) జరిగిందని తెలిపారు. 2014లో అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించి సమర్థవంతమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామని పేర్కొన్నారు. తూఫ్రాన్‌లో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.

సీఎం కేసీఆర్‌ రెండో స్థానం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారో ఆలోచించాలని ప్రజలను కోరారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్‌ రెండు చోట్ల పోటీ చేస్తున్నారన్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తున్న బీజేపీ సింహం ఈటల రాజేందర్‌ను చూసి కేసీఆర్‌ భయపడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భూ నిర్వాహితులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించరని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి కేసీఆర్‌ మోసం చేశారన్నారు. తెలంగాణకు తొలి సీఎంను దళితుడిని చేస్తానని చెప్పి ఆయన మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రజల ఆదాయం పెంచుతానని తన కుటుంబ ఆదాయం మాత్రమే పెంచుతున్నారని దుయ్యబట్టారు.

ఇరిగేషన్‌ స్కీమ్‌లను కేసీఆర్‌ ఇరిగేషన్‌ స్కామ్‌లు చేశారు : పీఎం మోదీ

"కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య పెద్దగా తేడా లేదు. కాంగ్రెస్‌ సుల్తానులను పెంచి పోషిస్తే.. బీఆర్‌ఎస్‌ నిజాంలను పోషించింది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు బోఫోర్స్‌ వంటి ఎన్నో కుంభకోణాలు జరిగాయి. కేసీఆర్‌ పాలనలో ఎమ్మెల్యేలు ప్రతిదాంట్లో 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. దేశంలో కాంగ్రెస్‌ అవినీతిక పాల్పడితే.. రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారు." - నరేంద్ర మోదీ, ప్రధాని

PM Modi Telangana Election Campaign : అందుకే ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా అంటూ తెలుగులో పీఎం మోదీ ప్రశ్నించారు. ఎప్పుడూ సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా.. ఎప్పుడూ ఫామ్‌హౌజ్‌లో ఉండే సీఎం మనకు అవసరమా అంటూ ప్రజలను ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వారసత్వ రాజకీయాల వల్ల వ్యవస్థ నాశనం అయిందని ఆవేదన చెందారు. ఆ రెండు పార్టీలు ఒకటే.. ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

'నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ నిధులన్నీ కేసీఆర్‌ కుటుంబానికి వెళ్లాయి. నీళ్లు పేరు చెప్పి.. నిధులన్నీ కేసీఆర్‌ కుటుంబానికి వెళ్లాయి. గ్రూప్‌-1 వంటి పరీక్ష పేపర్లు లీక్‌ అయి.. నియామకాలు జరగలేదు. తెలంగాణను లూటీ చేసిన తర్వాత కేసీఆర్‌ దృష్టి దేశం మీద పడింది. దేశాన్ని కూడా లూటీ చేసేందుకు దిల్లీకి వెళ్లి అక్కడ ఒక నేతతో చేతులు కలిపారు. దిల్లీలో ఒక నేతతో చేతులు కలిపి మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. అలాగే రైతులను మోసం చేయడంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకరికొకరు తీసుపోరని' పీఎం మోదీ విమర్శలు చేశారు.

PM Modi BC CM Slogan in Election Campaign : కుటుంబ పార్టీలు తమ వారసుల గురించి మాత్రమే ఆలోచిస్తాయన్నారు. బీసీల్లో ఎంతో ప్రతిభావంతులు ఉన్నప్పటికీ న్యాయం జరగడం లేదని ఆందోళన చెందారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని.. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ధైర్యంగా ప్రకటించిందని హర్షించారు. తెలంగాణలో మాదిగలకు జరిగిన అన్యాయాన్ని బీజేపీ అర్థం చేసుకుందని పీఎం మోదీ అన్నారు.

ప్రజలను కలవని సీఎం, సచివాలయానికి రాని సీఎం మనకు అవసరమా? మోదీ

గెలిచే అవకాశాలున్న స్థానాలపై బీజేపీ స్పెషల్​ ఫోకస్​ - జాతీయ నాయకుల రోడ్ షోలు, సభలతో బిజీబిజీ

ఎస్సీ వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నాం, త్వరలో కమిటీ వేస్తాం : ప్రధాని మోదీ

Last Updated : Nov 26, 2023, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.