అవినీతి అధికారుల ధన దాహం ఏ స్థాయిలో ఉంటుందో ఓ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఇంట్లో దొరికిన నోట్ల కట్టేలే ప్రత్యక్ష సాక్ష్యం. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన సోదాల్లో ఎక్కడ చూసినా కట్టల కొద్దీ నోట్లు దొరకడంతో విస్తుపోవడం అధికారుల వంతైంది. బిహార్‌లోని పట్నాకు చెందిన డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ జితేంద్ర కుమార్ అధికారిక నివాసంతోపాటు మరో నాలుగు చోట్ల ఏకకాలంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమాస్తుల కేసులో భాగంగా ఈ సోదాలు చేపట్టారు.
వంద నోటు నుంచి రూ. 2000 నోట్ల కట్టలు వరకు భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంత మొత్తం దొరికిందో తెలుసుకోవడానికి అధికారులు కొన్ని గంటల నుంచి లెక్కిస్తుండటం గమనార్హం. ఈ మొత్తం డబుల్ కాట్ బెడ్‌నే ఆక్రమించేసింది. అంతేకాకుండా ప్రాపర్టీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, భారీగా బంగారం, వెండి, నాలుగు లగ్జరీ కార్లను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జప్తు చేసిన ఆస్తుల విలువను లెక్కించే పనిలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'ఫ్రీ ఫైర్'లో బాలికతో పరిచయం.. ఖతర్ నుంచి వచ్చి కిడ్నాప్.. నేపాల్‌కు తీసుకెళ్తుండగా..
ఆరేళ్ల బాలిక, ఆమె తల్లిపై గ్యాంగ్‌రేప్.. కదులుతున్న కారులోనే.. ఆ తర్వాత రోడ్డుపై..