Drunk man dares police: బిహార్‌లో మద్యపాన నిషేధం విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. మద్యం తయారీ, విక్రయాలతో పాటు తాగటమూ నేరమే. నిబంధనలు ఉల్లంఘించిన వారిని జైలుకు పంపుతామని అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయితే, ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి పోలీసులకే సవాల్ విసిరాడు. 'నేను మందు కొట్టాను, దమ్ముంటే పట్టుకోండి' అంటూ స్టేషన్‌కు ఫోన్ చేశాడు. అరెస్టై జైలు పాలయ్యాడు.
ఇదీ జరిగింది: పశ్చిమ చంపారన్ జిల్లా శిఖర్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంకి గ్రామానికి చెందిన అమ్రేశ్ కుమార్ సింగ్.. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి తాను మద్యం సేవించానని, మీకు చేతనైతే పట్టుకోవాలంటూ సవాల్ చేశాడు. తాను ఓ జర్నలిస్ట్ అని చెప్పుకున్నాడు. అయితే, ఎవరో కావాలని ప్రాంక్ చేస్తున్నారని భావించిన స్టేషన్ అధికారి అజయ్ కుమార్ ముందు పట్టించుకోలేదు. కానీ, పలుమార్లు ఫోన్ చేయగా.. పోలీసులు అమ్రేశ్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న అతడ్ని అరెస్ట్ చేశారు.
ఫోన్లో చెప్పినట్లుగానే అమ్రేశ్ మద్యం మత్తులోనే ఉన్నాడని పోలీసు అధికారి అజయ్ కుమార్ తెలిపారు. బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా లిక్కర్ సేవించినట్లు తేలిందన్నారు. అబ్కారీ చట్టం ప్రకారం అమ్రేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: పెళ్లి.. ఫస్ట్ నైట్ డ్రామా.. డబ్బుతో మాయం.. ఏడుసార్లు సీన్ రిపీట్!