జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం సభ్యుడు వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలించేందుకు అనుమతిచ్చింది బాంబే హైకోర్టు. చికిత్స నిమిత్తం 15 రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచాలని ఆదేశించింది. దీనికి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది. ఆసుపత్రి నిబంధనల మేరకు కుటుంబ సభ్యులు ఆయన్ని కలిసేందుకు అగీకారం తెలిపింది కోర్టు.
వరవరరావు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని, చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య హేమలత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ఈ బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)
ఇదీ చూడండి: వరవరరావు ఆరోగ్య స్థితిపై వైద్యులకు ఆదేశం