BJP Rajya Sabha: త్వరలో 9 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 16 రాజ్యసభ స్థానాలకు భాజపా అభ్యర్ధులను ప్రకటించింది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ను కర్ణాటక నుంచి, పీయూష్ గోయల్‌ను మహారాష్ట్ర నుంచి అభ్యర్ధులుగా ఎంపిక చేసింది. ప్రస్తుతం వీరు అవే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. త్వరలోనే వీరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికలు జూన్ 10న జరగనున్నాయి.
సుశ్రి కవితా పటిదార్‌కు మధ్యప్రదేశ్ నుంచి, జగ్గేష్‌కు కర్ణాటక నుంచి, అనిల్ సుఖ్‌దేవ్‌రావ్ బొండేకు మహారాష్ట్ర నుంచి, ఘన్‌శ్యామ్ తివారీకి రాజస్థాన్ నుంచి, లక్ష్మీకాంత్ వాజ్‌పేయీ, రాధామోహన్ అగర్వాల్, సురేంద్రసింగ్ నగర్, బాబురామ్ నిషద్, దర్శన సింగ్, సంగీత యాదవ్‌కు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి, కల్పనా సైనాకు ఉత్తరాఖండ్ నుంచి, సతీష్ చంద్రదూబేకు బిహార్ నుంచి, కిషన్ లాల్ పన్వార్‌కు హరియాణా నుంచి అవకాశం కల్పించారు. ఈమేరకు భాజపా కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుద చేసింది.
ఇవీ చూడండి: 'ఆధార్ జిరాక్స్' సూచనలపై కేంద్రం యూటర్న్.. మళ్లీ ఏమైందంటే?