రైల్వే ప్రాంగణాల్లో పేరుకుపోయిన చెత్త, నిల్వ కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న ఇనుప తుక్కును విక్రయించి ఏడాదిలోనే రూ.517.5 కోట్లు ఆర్జించింది పశ్చిమ రైల్వే. ఇది రైల్వేల్లో సరికొత్త రికార్డు. గతంలో ఉత్తర రైల్వే రూ.403కోట్లకు చెత్తను విక్రయించింది. ఆ రికార్డును తిరగరాసింది పశ్చిమ రైల్వే.
అధికారిక కార్యాలయాలు, రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లోని చెత్తను పూర్తిగా తొలగించేందుకు 'మిషన్ జీరో స్క్రాప్' పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు పశ్చిమ రైల్వే అధికారులు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చీఫ్ పీఆర్వో రవిందర్ భాస్కర్ తెలిపారు.
ఇదీ చూడండి:చౌకీదార్ కప్పులపై రైల్వేకు ఈసీ నోటీసులు