భారత్‌లో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. రహదారులు రక్తమోడని రోజు ఉండటం లేదు. వీటి కారణంగా ఏటా వేల మంది చనిపోతుంటే..అంతకు అయిదు రెట్లు క్షతగాత్రులవుతున్నారు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాలు అతి ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ ఒకటని ప్రపంచ బ్యాంకు గుర్తించింది. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఒక నివేదికను తాజాగా సమర్పించింది.
వివరాలు ఇలా..