కేరళలోని వయనాడ్లో ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సులో నుంచి ఓ మహిళ కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వెనకే వస్తున్న మరో బస్సు సమయానికి బ్రేకులు వేయడం వల్ల పెను ప్రమాదం తప్పింది. చికిత్స నిమిత్తం కొజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు.
వైథిరి బస్స్టాండ్ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని తాలిమలకు చెందిన శ్రీవల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో నిక్షిప్తమయ్యాయి.
ఇదీ చదవండి: నేడు డిఫెన్స్ ఎక్స్పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ