ETV Bharat / bharat

అంబులెన్స్​కే దారి లేదు- క్షతగాత్రులకు బైకులే శరణ్యం!

పౌరచట్ట వ్యతిరేక ఆందోళనలు దిల్లీలో మిన్నంటుతున్నాయి. రహదారులను దిగ్బంధించిన ఆందోళనకారులు అంబులెన్స్​కు కూడా దారివ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఘర్షణల్లో గాయాలైన వారు బైక్​లు, వ్యానుల్లో ఆసుపత్రులకు వెళుతున్నారు.

author img

By

Published : Feb 25, 2020, 8:05 PM IST

Updated : Mar 2, 2020, 1:50 PM IST

caa
'పౌర' సెగ: అంబులెన్స్​కూ ఇవ్వని దారి- క్షతగాత్రులకు బైకులే శరణ్యం!

సీఏఏ వ్యతిరేక నిరసనల్లో భాగంగా దిల్లీలో రహదారులను దిగ్బంధించారు ఆందోళనకారులు. అన్ని రకాల వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఆందోళనల్లో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు కనీసం అంబులెన్స్​లకు కూడా చోటివ్వని పరిస్థితి నెలకొంది. దీంతో బైక్​లు, వ్యానుల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు అధికారులు.

ఆందోళన సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగుతుండగా నిరసనకారులను చెదరగొట్టేందుకు యత్నించిన కానిస్టేబుల్​ అమిత్​కుమార్ చేతికి గాయమైంది. ఈ నేపథ్యంలో అతడిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్​కు దారివ్వని కారణంగా బైక్​పైనే తీసుకెళ్లారు. ఇలాగే ఇతరులను కూడా ఆసుపత్రికి చేర్చారు.

"ఖజూరీ ఖాస్​లో నేను రెండు గ్రూపులను చెదరగొట్టేందుకు యత్నిస్తున్నాను. వెనక నుంచి నాకు బలంగా ఏదో తాకింది. దీంతో నేను గాయపడ్డాను."

-అమిత్​ కుమార్, కానిస్టేబుల్

ఇదే ఖురేజీ ఖాస్ ప్రాంతంలో కైఫ్ అనే మరోవ్యక్తికి గాయాలయ్యాయి. అంబులెన్స్​కు దారి తొలగని కారణంగా వ్యాన్​లో ఆసుపత్రికి తరలించారు. తూటా తగిలిన మరో వ్యక్తిని సైతం ఇలాగే బైక్​పై ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​, సీఏఏ సంగతి మోదీ చూసుకోగలరు: ట్రంప్​

Last Updated : Mar 2, 2020, 1:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.