ETV Bharat / bharat

ఇకపై మాస్కు ధరించకపోతే 3 ఏళ్ల జైలుశిక్ష!

గుజరాత్​ అహ్మదాబాద్​లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని ఆదేశించారు అధికారులు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారికి రూ.5వేలు జరిమానా లేదా మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని స్పష్టం చేశారు.

author img

By

Published : Apr 12, 2020, 3:56 PM IST

Wear mask in Ahmedabad or face Rs 5000 fine/3-year jail
ఇకపై మాస్కు ధరించకపోతే 3 ఏళ్ల జైలుశిక్ష

గుజరాత్​లోని అహ్మదాబాద్​ నగరంలో కరోనా కేసులు అధికమౌతున్న కారణంగా.. ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింత కఠినం చేశారు అధికారులు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించారు.

ఎవరైనా ఇళ్ల నుంచి మాస్కు లేకుండా బయటకు వస్తే రూ.5వేల జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామని తెలిపారు. అంటువ్యాధుల చట్టం కింద ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు అహ్మదాబాద్​ మునిసిపల్​ కమిషనర్​ విజయ్​ నెహ్రా తెలిపారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ ఈ ఆదేశాలను పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధికంగా అహ్మదాబాద్​లోనే 266 మంది వైరస్​ బారిన పడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.