ETV Bharat / bharat

మనిషి కంటే ముందే పుట్టిన వైరస్‌లు

వాటికి మెదడు లేదు.. మహా మేధావులనూ బోల్తా కొట్టిస్తుంటాయి. వాటిలో సొంత జీవక్రియలూ లేవు.. పునరుత్పత్తీ చేసుకోలేవు. అయితేనేం లక్షలు.. కోట్లలో పుట్టుకొస్తూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటాయి. అవే వైరస్‌లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కరోనాది కూడా ఈ జాతే. అసలు ఏమిటీ వైరస్‌లు? వీటికి ఇంత శక్తి ఏంటి? 'పుట్టు'పూర్వోత్తరాలేంటి? ఓ సారి చూద్దాం...

VIRUS SPECIAL STORY
మనిషి కంటే ముందే పుట్టిన వైరస్‌లు
author img

By

Published : Apr 23, 2020, 6:33 AM IST

మానవాళిని వైరస్‌లు వేలాది సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. జీవనోపాధికి మనుషులు వ్యవసాయం వైపు మరలి, జంతువులను మచ్చిక చేసుకొనే క్రమంలోనే వారికి అనేక రకాల వైరస్‌లు సంక్రమించాయి. ప్రజలు సమూహాలుగా జీవించడం, జనాభా పెరగడంతోనూ కొత్త ఇన్‌ఫెక్షన్లు సోకాయి. ఏవియన్‌ ఫ్లూ, సార్స్‌, హెచ్‌ఐవీ, ప్రస్తుత కొవిడ్‌-19.. ఇవన్నీ ఇతర జీవుల నుంచి వచ్చినవే.

ఇదీ విషయం

శాస్త్ర సమాజం వైరస్‌లపై అనేకసార్లు భిన్న అభిప్రాయాలకు వచ్చింది. తొలుత 'విషం'గాను.. తర్వాత జీవ రూపాలుగాను.. కొంతకాలానికి జీవ రసాయనాలుగాను పరిగణించింది. చివరికి వైరస్‌లుగా ఖరారు చేసింది. మొదట్లో గ్రీకులు, రోమన్లు... ఇవి సోకడానికి చెడుగాలి, దుర్వాసన వంటివి కారణాలుగా అంచనా వేశారు. కుళ్లిపోయిన కాఫీ గింజలతోనే ఎల్లో ఫీవర్‌ వస్తోందని 18వ శతాబ్దంలో భావించారు.

ఉనికి తేలిందిలా...

VIRUS SPECIAL STORY
ఉనికి తేలిందిలా...
  • 17వ శతాబ్దంలో మైక్రోస్కోప్‌ను కనుగొన్నాక సూక్ష్మక్రిములపై శోధన మొదలైంది. తొలుత బ్యాక్టీరియాను గుర్తించారు.
  • 19వ శతాబ్దం చివర్లో రేబిస్‌ వంటి కొన్ని వ్యాధులు... బ్యాక్టీరియాను పోలిన, వాటికంటే చిన్నగా ఉన్న రేణువులతోనే వస్తుండొచ్చని తేల్చారు.
  • 1892లో రష్యన్‌ బ్యాక్టీరియాలజిస్టు దిమిత్రి ఇవానోవ్‌స్కీ తొలిసారిగా వైరస్‌ ఆచూకీని పసిగట్టారు. దీనికి ‘టొబాకో మొజాయిక్‌ వైరస్‌’గా పేరు పెట్టారు. 1935లో వెండెల్‌ ఎం స్టాన్లీ అనే శాస్త్రవేత్త టొబాకో మొజాయిక్‌ వైరస్‌ సమూహాన్ని క్రమపద్ధతిలో అమర్చి(క్రిస్టలైజేషన్‌) విశ్లేషించారు.
  • 1940ల్లో ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోపు ఆవిష్కరణతో వైరస్‌లను ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు.

సాధారణ నిర్మాణం

వైరస్‌ల నిర్మాణం చాలా సాధారణంగా ఉంటుంది. ఇవి న్యూక్లిక్‌ ఆమ్లాలు, ప్రొటీన్లు, లిపిడ్లు, నీటితో తయారవుతాయి. బ్యాక్టీరియాతో పోలిస్తే 100 నుంచి 1000 రెట్లు చిన్నవి. సగటున వీటి వెడల్పు 20-400 నానో మీటర్లు. మనుగడ, పునరుత్పత్తి కోసం మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, మనుషులపై ఆధారపడతాయి. పైగా అతిథేయ జీవుల(హోస్ట్‌) శరీరం వెలుపల క్రియాశీలంగా ఉండలేవు. వీటికి ఆహారాన్ని శక్తిగా మార్చుకునే జీవక్రియ సామర్థ్యమూ లేదు. అందుకే వీటిని పలువురు శాస్త్రవేత్తలు జీవులుగా పరిగణించడం లేదు. అయితే వీటిలో జీవానికి సంబంధించిన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలు ఉండటంతో జీవులకు, రసాయనాలకు మధ్యనున్న ప్రత్యేక తరగతిగా పరిగణిస్తున్నారు.

జబ్బులను తెచ్చేదిలా..

పునరుత్పత్తి కోసం మనుషులు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు, శిలీంద్రాలలో తనకు సరిపడే అతిథేయిని గుర్తించడానికి వైరస్‌ల ఉపరితలాలపై రెసెప్టార్లు ఉంటాయి. వీటిద్వారా అతిథేయి కణంలోకి ప్రవేశించగానే వైరస్‌ తన జన్యు పదార్థాన్ని ప్రవేశపెడుతుంది. కణ యంత్రాంగాన్ని హైజాక్‌ చేసి స్వీయ జన్యు పదార్థాన్ని, ప్రొటీన్ల సంఖ్యను వేల సంఖ్యల్లోకి పెంచేసుకుంటుంది. ఇతర కణాలకూ ఇన్‌ఫెక్షన్‌ను వ్యాప్తిచేస్తాయి. ఫలితంగా అతిథేయ జీవి జబ్బున పడుతుంది.

వ్యాప్తి ఎలా?

VIRUS SPECIAL STORY
వ్యాప్తి ఎలా?

వైరస్‌లు ఒకచోటు నుంచి మరోచోటికి ప్రయాణించలేవు. అయితే బరువు తక్కువగా ఉండటంతో రోగి శరీరం నుంచి బయటకు వచ్చాక స్వల్ప దూరంపాటు గాలిలో ఎగరగలవు. నీటిలోనూ మనుగడ సాగిస్తాయి. మన చర్మంపైనా ఉంటాయి. కరచాలనం, ఒక వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతాయి. చల్లటి, పొడి వాతావరణంలో ఎక్కువ కాలం మనగలుగుతాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తి రక్తం, మలం, వాంతి ద్వారా ఎబోలా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. డెంగీ, జికా, గన్యా, వెస్ట్‌ నైల్‌ వంటి వైరస్‌లు మాత్రం దోమ వంటి ఇతర జీవుల సాయంతో వ్యాప్తి చెందుతాయి.

వేగంగా మార్పు

వైరస్‌లు వేగంగా పరిణామం చెందుతాయి. అతిథేయ కణంలోకి ఒక వైరస్‌ జన్యు పదార్థం ప్రవేశించగానే కొన్ని గంటల్లోనే అది ఇబ్బడిముబ్బడిగా పునరుత్పత్తి చేసుకుంటాయి. మాయదారి సంతలా సంతతి పెంచేసుకుంటాయి. దీంతో వేగవంతమైన ఉత్పరివర్తనల ద్వారా అవి టీకాలు, మందులు, అతిథేయ జీవిలోని రోగ నిరోధక వ్యవస్థను బోల్తా కొట్టిస్తాయి.

ఎక్కడి నుంచి వచ్చాయి?

VIRUS SPECIAL STORY
ఎక్కడి నుంచి వచ్చాయి?

వివిధ కారణాలతో ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయిన కణాల నుంచి మిగిలిపోయిన శకలాలే వైరస్‌లుగా మారాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం వైరస్‌లు.. భూమ్మీద అత్యంత పురాతన జీవం కన్నా ముందు నుంచే ఉన్నాయంటున్నారు. కొన్నిరకాల పెద్ద వైరస్‌లలో స్వతంత్రత ఎక్కువ. ఈ అంశం ఆధారంగా... భూమి మీదున్న జీవానికి 'నిర్మాణ ఇటుకలు'గా ఇవి ఉపయోగపడి ఉంటాయని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తొలినాటి సంక్లిష్ట జీవుల ఆవిర్భావంలోనూ అవి కీలక పాత్ర పోషించి ఉండొచ్చని అంచనా. మానవ డీఎన్‌ఏలో దాదాపు సగభాగం వైరస్‌ల నుంచే వచ్చింది. మన పూర్వీకుల అండాలు, వీర్యకణాల్లో ఇవి తిష్టవేయడం ద్వారా డీఎన్‌ఏలో భాగమయ్యాయి. అయితే అలా చేరిన వైరస్‌ జాతుల్లో చాలావరకూ ఇప్పుడు అంతరించి పోయాయి.

ఆ పేరెలా వచ్చింది?

వైరులెంటస్‌ అనే లాటిన్‌ మాట నుంచి ‘వైరస్‌’ పదం వచ్చింది. విషతుల్యమని దీని అర్థం. 19వ శతాబ్దంలో ప్రమాదకర వ్యాధిని కలిగించే ఏ పదార్థాన్నైనా ఈ పేరుతోనే పిలిచేవారు. విషతుల్యతతో జబ్బులు వస్తున్నాయన్న భావనతో ఈ పేరును ఖరారు చేశారు.

తయారీ సులువే

సాధారణ వైరస్‌లను ప్రయోగశాలలో కూర్చడం చాలా సులువు. శుద్ధి చేసిన ప్రొటీన్‌ను, న్యూక్లిక్‌ జీనోమ్‌ను తీసుకుని.. వీటిని నిర్దిష్ట లవణీయత, ఆమ్లత, ఉష్ణోగ్రతల మధ్య నీటిలో కలిపితే.. కొంత కాలానికి వీటిలో కొన్ని.. ఇన్‌ఫెక్షన్‌ కారక వైరస్‌ రేణువులుగా తయారవుతాయి.

వైరాలజీ

వైరస్‌లు, మానవాళి ఒకే ప్రపంచంలో కలిసి ఉండాల్సిందే. అందువల్ల వాటి నుంచి గరిష్ఠ రక్షణకు కవచం అవసరం. దీన్ని రూపొందించేదే వైరాలజీ... వైరస్‌ల తీరుతెన్నులపై పరిశోధనలు చేసి, మానవాళికి ఇది ఆసరాగా నిలుస్తోంది. ఫలితంగానే పోలియో, మీజిల్స్‌, రూబెల్లా వంటి అనేక ఇన్‌ఫెక్షన్లకు టీకాలు వచ్చాయి.

ఇదీ చదవండి: నెల వ్యవధిలోనే 20 వేలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.