ఉత్తరప్రదేశ్‌కు చెందిన 75 ఏళ్ల ఫక్కడ్ బాబా... లోక్‌సభ ఎన్నికల్లో మధుర స్థానం నుంచి స్వతంత్రుడిగా నిలబడుతున్నారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఇంతకుముందు 16సార్లు ఎన్నికల్లో పోటీ చేశారాయన. ఇందులో సగం విధానసభ ఎన్నికలు, మరో సగం లోక్‌సభకు సంబంధించినవి. అన్నింటిలో ఘోర పరాజయం చవిచూశారు బాబా.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఫక్కడ్ బాబాకు 3వేల 400 ఓట్ల వచ్చాయి. అప్పుడు మధుర నియోజకవర్గం నుంచి భాజపా నాయకురాలు, సినీ నటి హేమ మాలిని బరిలో ఉండటం విశేషం. 2017 ఉత్తరప్రదేశ్ విధానసభ ఎన్నికల్లో 4,200 ఓట్లు పొందారు బాబా. ఇప్పుడు మరోమారు మధుర స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. 17వసారీ ఓటమి ఖాయమని ముందే జోస్యం చెబుతున్నారాయన. 20వసారి తప్పక గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన గురువు నిశ్చలానంద స్వామి ఈ మేరకు దీవించినట్లు తెలిపారు.
గురువు నిర్దేశించిన గో సంరక్షణే నా లక్ష్యం. పేదల సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది. మోదీ ఇది చేశారు, అది చేయలేదు అని మనం చెప్పుకోవచ్చు. కానీ పేదలను ఇప్పటివరకు చేరుకోలేకపోయారు. అవినీతి తగ్గిపోవాలి. నా ఓట్లను భాజపా ఇప్పటివరకు కొల్లగొడుతోంది. మధురలో భాజపా గెలుపొందాలని నేను కోరుకోవటం లేదు.
- ఫక్కడ్ బాబా, మధుర