తమిళనాడులోని వెల్లూర్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికపై గురువారం ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. వెల్లూర్ స్థానానికి ఆగస్టు 5న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 18న వెల్లూర్ స్థానానికి పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ ఆ ప్రాంతంలో డీఎంకే అభ్యర్థి సన్నిహితుల వద్ద భారీగా అక్రమ నగదు పట్టుబడటం వల్ల ఎన్నికను ఈసీ రద్దు చేసింది.
ఆగస్టు 9న లెక్కింపు...
వెల్లూర్ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ను జులై 11న విడుదల చేయనుంది ఈసీ. అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడానికి చివరి తేది జులై 18. ఆగస్టు 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చూడండి:- చైనాలో ప్రచండ గాలులకు ఆరుగురు బలి