ETV Bharat / bharat

స్టీల్​ప్లాంట్​లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి - blast news

Two killed in blast at steel company in Raigad
స్టీల్​ప్లాంట్​లో భారీ పేలుడు
author img

By

Published : Jul 14, 2020, 9:50 AM IST

Updated : Jul 14, 2020, 10:48 AM IST

10:27 July 14

స్టీల్​ప్లాంట్​లో భారీ పేలుడు.. ఇద్దరు మృతి

మహారాష్ట్ర రాయ్​గఢ్​​ జిల్లాలోని ఖపోలి నగరంలో ఉన్న ఇండియా స్టీల్​ప్లాంట్​లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.  

అయితే.. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కంపెనీ కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అర్ధరాత్రి జరిగిన పేలుడు సంభవించగా..  సుమారు కిలోమీటర్​ వరకు శబ్దం వినిపించింది. సమీపంలోని ఇళ్లు కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.  

చనిపోయిన వారిని దినేశ్​ వామన్​రావ్​ చౌహాన్(55), ప్రమోద్ ​దూద్​నాత్​ శర్మ (30)లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సుభాష్​ ధోండీభా వంజలే (55)ను ముంబయిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  ​

పరిశ్రమలో గతంలోనూ ఇలాంటి పేలుడు ఘటనలు జరిగాయి. ఎప్పటి మాదిరిగానే.. ఈసారి ఎలాంటి వివరాలు వెల్లడించకుండా ఉండిపోయింది సంస్థ.  

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

09:45 July 14

రాయ్‌గఢ్​‌లోని స్టీల్ ప్లాంట్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.

Last Updated : Jul 14, 2020, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.