పంటలను ధ్వంసం చేస్తున్నాయన్న కారణాలతో 200 పందులను ప్రజలు సజీవంగా పూడ్చివేశారు. ఇందుకోసం అధికారులు పెద్ద గుంత తవ్వించారు. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగింది.

200 పందులు...
హవేరి జిల్లాలోని హిరెకెరూరు పట్టణంలోని రైతులను పందులు నిద్రపోనివ్వడం లేదు. రైతుల పొలాల్లోకి చేరి.. పంటను ధ్వంసం చేస్తున్నాయి. ఈ విషయాన్ని పంచాయతీ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. పందుల యజమానులను అధికారులు హెచ్చరించారు. కానీ ఫలితం దక్కలేదు. ఇందుకు ఆగ్రహించిన అధికారులు... పెద్ద గుంతను తవ్వి, పందులను పూడ్చివేయించారు.
ఇదీ చూడండి:- మైనారిటీలపై దాడులు.. పాక్పై భారత్ తీవ్ర ఆగ్రహం