ETV Bharat / bharat

నమస్తే ట్రంప్: 'ఫ్యామిలీ ప్యాక్​'తో కొత్త​ చరిత్ర!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు చాలా విశేషాలే ఉన్నాయి. తొలిదఫా పదవీకాలంలో భారత పర్యటన చేపట్టిన నాలుగో అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సృష్టించనున్నారు ట్రంప్. మరోవైపు కుటుంబ సమేతంగా భారత్​ను సందర్శించనున్న తొలి అమెరికా అధ్యక్షుడిగానూ ట్రంప్ చరిత్ర లిఖించనున్నారు.

Trump family
ట్రంప్ కుటుంబం
author img

By

Published : Feb 23, 2020, 10:02 AM IST

Updated : Mar 2, 2020, 6:47 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24న భారత పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు ఓ విశేషం ఉంది. అదేంటంటే.. భారత పర్యటనకు కుటుంబ సమేతంగా రానున్న తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కావడమే. అంతేకాక తొలిదఫా పదవీకాలంలో భారత్​లో పర్యటిస్తున్న నాలుగో అమెరికా అధ్యక్షుడిగా రికార్డు సృష్టించనున్నారు ట్రంప్.

ఈ పర్యటనకు ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ సైతం విచ్చేస్తున్నారు. ట్రంప్ కుమార్తె, అధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంక ట్రంప్, ఆమె భర్త కూడా అధ్యక్షుడి భారత పర్యటనలో భాగం కానున్నారు.

గతంలో...

ఇదివరకు భారత్​ను సందర్శించిన అమెరికా అధ్యక్షులందరూ కుటుంబ సమేతంగా పర్యటించలేదు. బిల్ క్లింటన్ భారత్​లో పర్యటించిన సందర్భంగా తన కుమార్తెను వెంటబెట్టుకొని వచ్చారు. తన సతీమణి హిల్లరీ క్లింటన్​ను తీసుకురాలేదు. మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్, జార్జి డబ్ల్యూ బుష్​లు అందరు కూడా తమ సతీమణులతో భారత్​లో పర్యటించారు. కానీ తమ పిల్లలను వెంటబెట్టుకురాలేదు. అయితే వీరందరి రికార్డును అధిగమిస్తూ భార్యాపిల్లలతో పర్యటించనున్నారు ట్రంప్.

ప్రథమ మహిళలూ...

మరోవైపు అధ్యక్షులు కాకుండా అమెరికా ప్రథమ మహిళలు సైతం భారత్​లో పర్యటించారు. అమెరికాకు 35వ అధ్యక్షుడిగా పనిచేసిన జాన్​ ఎఫ్​ కెన్నెడీ భార్య జాకీ కెన్నెడీ భారత్​లో పర్యటించారు. అయితే ఈ పర్యటనకు అధ్యక్షుడు హాజరుకాలేదు. కేవలం జాకీ కెన్నెడీ మాత్రమే భారత్​లో పర్యటన చేపట్టారు. ఇందిరా గాంధీ హయాంలో పర్యటించిన జాకీ... ఆగ్రాను సందర్శించారు.

ఇదివరకే వచ్చిన ఇవాంక

ట్రంప్ కుటుంబం మినహా ఇప్పటివరకు అధ్యక్షులుగా పనిచేసిన వారి పిల్లలు ఎవరూ కూడా ప్రభుత్వంలో విధులు నిర్వర్తించలేదు. ట్రంప్ కూతురు ఇవాంక.. ప్రస్తుతం అధ్యక్షుడికి సీనియర్ సలహాదారు​గా ఉన్నారు. ట్రంప్ కుమార్తె ఇవాంక భారతీయులకు సుపరిచితురాలే. ఇదివరకే భారత్​లో పర్యటించారు ఇవాంక. 2017లో హైదరాబాద్​లో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొన్నారు.

అధ్యక్షుడి పర్యటనలో భాగం కానున్న ఇవాంక భర్త జారెద్ కుష్నర్​ కూడా శ్వేతసౌధంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అధ్యక్షుడికి ఇవాంకతో పాటు సలహాదారుగా ఉన్నారు. ఈ నలుగురు భారత పర్యటన చేపట్టడం వల్ల చాలా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇవీ ప్రాధాన్యాంశాలే..

విదేశీ పర్యటనలను డొనాల్డ్ ట్రంప్ పెద్దగా ఇష్టపడరు. ఆయన ఆసియాలో పర్యటించిందీ చాలా తక్కువే. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలోనే ట్రంప్ భారత్​లో పర్యటిస్తున్న నేపథ్యంలో మరింత ప్రాధ్యాన్యం సంతరించుకుంది.

ఈ ఏడాది నవంబర్​లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమొక్రాటిక్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి కోసం ఇప్పటికే డిబేట్లు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో భారత్​లో పర్యటించే 36 గంటలు ట్రంప్​కు చాలా ముఖ్యం.

బుష్ తర్వాతే అంతా..

జార్జి బుష్​కు ముందు జరిగిన అమెరికా అధ్యక్షుల పర్యటనలకు అంతగా ప్రాధాన్యం లేదనే చెప్పుకోవాలి. స్వాతంత్ర్యానంతరం భారతదేశ సందర్శనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు ఐసెన్​హోవర్​, జిమ్మీకార్టర్​ల పర్యటనలు కేవలం ఏనుగు సవారీలు, శాండల్​వుడ్ గార్డెన్​లకు పరిమితమైందంటారు విమర్శకులు. పోఖ్రాన్ అణు పరీక్షల నేపథ్యంలో కార్టర్ పర్యటించగా.. 1971 పాక్​ యుద్ధనంతరం నిక్సన్​ ఒకరోజు భారత పర్యటన చేపట్టారు. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీతో ఏర్పడ్డ మనస్పర్థలు తొలగించుకునేందుకే నిక్సన్ ఈ పర్యటన చేపట్టినట్లు విశ్లేషకుల అభిప్రాయం.

Last Updated : Mar 2, 2020, 6:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.