జమ్ముకశ్మీర్ ఉధమ్పుర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లను తరలిస్తున్న లారీ ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతైంది. మంటలు వ్యాప్తించటం వల్ల దాదాపు 45 నిమిషాల పాటు గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుకు ఇరువైపులా వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
మార్గమధ్యలో మంటలు...
లారీ జమ్ములోని బారి బ్రాహ్మణ నుంచి ఉత్తర కశ్మీర్లోని సోపోర్కు 300 గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్తుండగా... తిక్రీ ప్రాంతానికి వచ్చే సరికి అకస్మాత్తుగా మంటలు చేరలేగాయని అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి కొన్ని సిలిండర్లు 100 అడుగులు దూరంలో పడినట్లు పేర్కొన్నారు. లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని తెలిపారు.