ETV Bharat / bharat

'సాగు చట్టాలపై వివాదానికి త్వరలో పరిష్కారం' - వ్యవసాయ చట్టాల్లో సంస్కరణ

కొత్త సాగు చట్టాలపై చేపడుతున్న నిరసనలు ఒకే రాష్ట్రానికి పరిమితమైనవన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Narendra sing tomar
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్
author img

By

Published : Dec 16, 2020, 7:31 PM IST

సాగు చట్టాల్లో సంస్కరణలతో దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొందని, దిల్లీ సరిహద్దులో చేస్తోన్న రైతుల నిరసనలు మాత్రం అందుకు మినహాయింపు అని పేర్కొన్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. రైతుల నిరసనలు ఒక రాష్ట్రానికే పరిమితమైనవి చెప్పారు. కర్షక సంఘాలతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్న క్రమంలో త్వరగా పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

అసోచామ్​ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రైతుల ఆందోళనలపై ఈమేరకు స్పందించారు తోమర్​.

" వ్యవసాయ రంగంలో ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణల పట్ల దేశవ్యాప్తంగా సానుకూలత కనిపిస్తోంది. అయితే... దిల్లీ సరిహద్దులో జరుగుతోన్న ఆందోళనలు మాత్రం అందుకు మినహాయింపు. అవి ఒకే రాష్ట్రానికి పరిమితమైనవి. మేము చర్చలు చేపడుతున్నాం. త్వరగా పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నా. ఒకవైపు నిరసనలు కొనసాగుతుంటే, లక్షల మంది రైతులు కొత్త చట్టాలకు మద్దతుగా నిలుస్తున్నారు. రైతుల ఆదాయం పెరిగేలా, సాగు రంగం లాభదాయకంగా మారేందుకు గత ఆరేళ్లుగా కేంద్రం పలు చర్యలు చేపట్టింది. కొవిడ్​-19 సమయంలోనూ సాగు రంగం కోసం పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల సృష్టి, 10వేల ఎఫ్​పీఓల ఏర్పాటుకు లక్ష కోట్ల రూపాయలు కేటాయించింది. "

- నరేంద్ర సింగ్​ తోమర్​. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి.

దేశప్రయోజనం కోసం కాదు..

రైతులను తప్పుదోవ పట్టించి ఆందోళనలతో లబ్ధిపొందేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ. ఇలాంటి రాజకీయాలు దేశ ప్రయోజనం కోసం కాదన్నారు. 'ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చర్చలు చేపట్టేందుకు సిద్ధంగా ఉంటుంది. వారి నిజమైన డిమాండ్లను అంగీకరించేందుకు సిద్ధం. వారు చర్చలు చేపట్టేందుకు ముందుకు రావాలి ' అని పేర్కొన్నారు గడ్కరీ. రైతుల ఆందోళనలపై పలు దేశాలు కలుగజేసుకోవటాన్ని తప్పుపట్టారు. అది ఆమోదయోగ్యం కాదని, భారత్​ ఎప్పుడూ ఇతరుల అంతర్గత విషయంలో జోక్యం చేసుకోలేదని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: సింఘూ సరిహద్దులో రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.