ETV Bharat / bharat

దిల్లీ దంగల్: ఓటింగ్​కు సర్వం సిద్ధం.. మరికొద్ది గంటల్లో పోలింగ్ ​ - chief minister aravind kejriwal

దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న దిల్లీ శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 70 శాసనసభ స్ధానాలకు ఒకే విడతలో నేడు పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు నిలుచున్నారు. కోటి 47లక్షల మంది ఓటర్లు నేతల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. దిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నడుస్తుండగా.. విజయంపై మూడు పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెలువడనున్నాయి.

delhi assembly election
దిల్లీ దంగల్: ఓటింగ్​కు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో పోలింగ్ షురూ..​
author img

By

Published : Feb 8, 2020, 5:29 AM IST

Updated : Feb 29, 2020, 2:33 PM IST

దిల్లీ దంగల్: ఓటింగ్​కు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో పోలింగ్ షురూ​

దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 70 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా.. 672 మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు. కోటి 47 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొననున్నారు. 13వేల 750 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 90వేలమందితో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు.

ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనేలా ఎన్నికల సంఘం ఆరుగురు ప్రముఖులతో ప్రచారం చేయించింది. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 70 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వైద్య చికిత్సకు అవసరమైన కిట్‌, దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీలు, ర్యాంపులు, వృద్ధులను ఇంటి నుంచి తీసుకొచ్చి తిరిగి దింపేందుకు వాహనాలు ఈ మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. భద్రత సహా 380 పోలింగ్‌ కేంద్రాల నిర్వహణ బాధ్యతను ఈసీ మహిళలకు అప్పగించింది. మరో 11 పోలింగ్‌ కేంద్రాలను పూర్తిగా దివ్యాంగులతోనే నిర్వహించనుండగా, ఇంకో 11 పోలింగ్‌ కేంద్రాల్లో అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు కల్పించింది.

షహీన్​బాగ్​పై ప్రత్యేక నిఘా..

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్​బాగ్​లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలోని 5 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. భారీగా బలగాలను మోహరించనున్నట్లు తెలిపారు.

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ వివరాలు

మొత్తం అసెంబ్లీ స్థానాలు 70
పోటీలో ఉన్న అభ్యర్థులు 672
మొత్తం ఓటర్లు 1,47,86,382
పోలింగ్ కేంద్రాలు 13,750
భద్రతా సిబ్బంది 90,000

ఎవరి ధీమా వారిదే...

దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న దిల్లీ శాసనసభ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ సహా భాజపా, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది ఆప్​. గత అయిదేళ్లుగా అన్ని వర్గాలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను తిరిగి గెలిపిస్తాయని గట్టి విశ్వాసంతో ఉంది. 9నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్న భాజపా... ఈ సారి ప్రజలు తమను మరింత ఆదరిస్తారనే నమ్మకంతో ఉంది. జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. 67 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రధాని మోదీ చరిష్మా తమను గెలిపిస్తాయని భావిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలోని షాహిన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళనలను గట్టిగా ప్రచారం చేసిన భాజపా.. ఇది తమకు మేలు చేస్తుందని భరోసాతో ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగింది కమలం పార్టీ.

ఇక దిల్లీని వరుసగా మూడు సార్లు పాలించి 2013లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తోంది. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని ఆప్‌ ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత తమకు కలసి వస్తుందనే నమ్మకంతో ఉంది.

ఇదీ చూడండి: మోదీ 'మాట'ను రికార్డుల నుంచి తొలగించిన వెంకయ్య

ZCZC
PRI GEN NAT
.HYDERABAD MDS14
TL-CORONAVIRUS
No coronavirus in T'gana so far; tests of 5 awaited: Govt
Hyderabad, Feb 7 (PTI): There have been no coronavirus-
positive cases in Telangana as of Friday, even as the test
results of five people were awaited, government officials
said.
A total of 56 samples had been tested till Thursday.
The five people, whose test results were awaited, have
been admitted to state-run hospitals here.
The tests for determination of nCov are now being
conducted at the state-run Gandhi Hospital.
The samples used to be sent earlier to the National
Institute of Virology (NIV), Pune.
Stating that no positive cases had been reported in the
state till date, Health Minister E Rajender appealed to the
media to observe restraint in reporting about the deadly
virus. PTI SJR
NVG
NVG
02072141
NNNN
Last Updated : Feb 29, 2020, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.