ETV Bharat / bharat

'వర్చువల్​ విచారణ' కోసం కోర్టులకు కేంద్రం నిధులు

కొవిడ్​ విజృంభణతో కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్​ ( వర్చువల్​) ద్వారా కేసుల విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఆయా న్యాయస్థానాల్లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సన్నద్ధమైంది కేంద్రం. అందులో భాగంగా సుమారు 2,500కిపైగా కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్​ క్యాబిన్లను ఏర్పాటుకు నిధుల్ని విడుదల చేసింది.

To boost virtual hearings, over 2,500 court complexes to get video conference cabins
కోర్టుల్లో వర్చువల్​ క్యాబిన్ల ఏర్పాటుకు కేంద్రం చర్యలు
author img

By

Published : Dec 6, 2020, 6:44 PM IST

కరోనా వైరస్​ దృష్ట్యా దేశవ్యాప్తంగా దాదాపు అన్ని న్యాయస్థానాలు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కేసుల విచారణ చేపట్టాయి. దిగువస్థాయి న్యాయస్థానాల్లో వర్చువల్​ సౌకర్యాలను పెంచేందుకు గానూ.. 2,506 కోర్టులకు నిధులు విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. ఆయా భవనాల్లో వీడియో కాన్ఫరెన్స్​ క్యాబిన్​లను ఏర్పాటుచేయాలని సూచిందింది.

వీడియో కాన్ఫరెన్స్​ క్యాబిన్ల ఏర్పాటు కోసం గత సెప్టెంబర్​లోనే సుమారు రూ.5.21కోట్ల నిధులను విడుదల చేశాయి సుప్రీంకోర్టు ఈ-కమిటీ, న్యాయశాఖలు. మలి విడతలో భాగంగా హార్డ్​వేర్​ పరికరాలు, మానిటర్స్​, కేబుల్స్​ వంటి వాటికి అక్టోబర్​లో మరో రూ. 28.886 కోట్లు అందించాయి.

ఆన్​లైన్​వైపే మొగ్గు..

దేశవ్యాప్తంగా సబార్డినేట్​ కోర్టులు సహా.. మొత్తం 3,288 న్యాయస్థాన భవనాలు ఉన్నాయి. వీటిలో 2,506 భవనాల్లో దృశ్యమాధ్యమ క్యాబిన్ల ఏర్పాటుకు నిధులు విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఆన్​లైన్​ ద్వారా కేసుల విచారణకు ప్రాధాన్యం ఏర్పడిన వేళ.. హైకోర్టులు, జిల్లా న్యాయస్థానాల్లో అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది.

దేశంలో లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి అక్టోబర్​ 28 నాటికి.. రాష్ట్ర, జిల్లా స్థాయి న్యాయస్థానాల్లో కలిపి మొత్తం 49.67లక్షలకు పైగా కేసుల్ని వర్చువల్​ పద్ధతిలో విచారించినట్టు కేంద్ర న్యాయశాఖ పేర్కొంది.

ఇదీ చదవండి: కరోనా రూల్స్ బ్రేక్ చేస్తే వ్యాసం రాయాల్సిందే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.