జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా కంగన్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది.
ముష్కరులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా... జవాన్లు దీటుగా స్పందించారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.
ముగ్గురు ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందిన వారని అధికారులు తెలిపారు. వారిలో ఒక ఐఈడీ నిపుణులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.