దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో ఆప్ మళ్లీ అధికార పగ్గాలను చేజిక్కించుకుంది. ఈ ఎన్నికలపై వేర్వేరు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ గెలుపు ఖాయమని తేల్చి చెప్పేశాయి. ఇండియా టుడే- యాక్సిస్, ఏబీసీ - సీ ఓటర్, టీవీ9- భారత్ వర్ష్- సిసిరో వేసిన అంచనాలు ఆప్, భాజపా తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఇండియా టుడే- యాక్సిస్ సర్వే ఆప్‌నకు 59-68 మధ్య వస్తాయని, భాజపా 2-11 స్థానాల మధ్య నిలుస్తుందని అంచనా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ సంస్థ ఎగ్జిట్‌పోల్స్ ఎంచనాలు, వాస్తవ ఫలితాలు ఒకటే అయ్యాయి.
వివిధ వార్తాసంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూస్తే..