ETV Bharat / bharat

మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు: మేయర్ ఆర్య - arya rajendran latest news

కేరళ తిరువనంతపురం మేయర్​గా ఎన్నికైన ఆర్య రాజేంద్రన్.. తనకు మద్దతునిచ్చిన నేతలకు ధన్యవాదాలు చెప్పారు. ఇంత భారీ స్థాయిలో మద్దతు లభిస్తుందనుకోలేదని అన్నారామె. ఎంపీ శశిథరూర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారమె.

Thankful for overwhelming support, says country's youngest Mayor Arya Rajendran
మద్దతునిచ్చిన అందరికీ కృతజ్ఞతలు: మేయర్ ఆర్య
author img

By

Published : Dec 30, 2020, 5:31 AM IST

కేరళలోని తిరువనంతపురం మేయర్​గా ఎన్నికైన ఆర్య రాజేంద్రన్.. తనకు మద్దతునిచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా.. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్​కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు 21ఏళ్ల ఆర్య.

"భాజపా, కాంగ్రెస్​తో సహా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు నాకు మద్దతుగా నిలిచారు. ఇంత భారీ స్థాయిలో స్పందన లభిస్తుందని నేను అనుకోలేదు. నా ప్రయాణంలో తోడుగా ఉన్న వారందరికీ ధన్యవాదాలు. ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తాను. యువతీ- యువకుల సమస్యలు.. మహిళా సాధికారత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. వీటితో పాటు సంక్షేమానికి తగిన ప్రాముఖ్యత ఇస్తాను.

- ఆర్య రాజేంద్రన్​, తిరువనంతపురం మేయర్.

వెల్లువెత్తిన అభినందనలు..

చిన్న వయసులోనే మేయర్​ పదవి దక్కించుకున్న ఆర్యకు.. దేశవ్యాప్తంగా వివిధ నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్​, రజనీకాంత్​, మోహన్​లాల్​తో పాటు శ్రీలంక యువజన, క్రీడా వ్యవహారాల మంత్రి నమల్​ రాజపక్స ఆమెను అభినందించారు. 'రాబోయే తరాల యువకులకు, ముఖ్యంగా మహిళలకు మీరు ప్రేరణగా నిలుస్తారు. మీ మార్గాన్ని వారు అనుసరిస్తారు' అని రాజపక్స ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి: భారత్​లో 19 కొత్త రకం కరోనా కేసుల గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.