విధి నిర్వహణలో అలుపెరగని సేవలందించిన శునకం (జూడో) మృతి పట్ల కేరళ అలెప్పీ పోలీసులు కన్నీటి పర్యంతమయ్యారు. బాంబు స్కాడులతో కలిసి ఎంతో శ్రమించిన ఘనత స్నిప్పర్దే. అందుకే జూడో మృతికి యావత్ పోలీసు శాఖ దిగ్భ్రాంతికి లోనైంది. జిల్లా ముఖ్య పోలీసు అధికారి కే ఎమ్ టామీ పుష్పగుచ్ఛాలు సమర్పించారు. పదుల సంఖ్యలో హాజరైన సిబ్బంది జూడో మృతదేహం ముందు గౌరవ వందనాలు చేశారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
కేరళ అలెప్పీ జిల్లాలో ఓ పోలీసు శునకమే 'జూడో'. పోలీసుల శాఖకు ఎనలేని సేవలందించింది. నిబద్ధతతో వృత్తి బాధ్యతలు నిర్వహించే జూడోకు జిల్లా పోలీసు శాఖలో మంచి పేరుంది. జూడోను ప్రేమగా బ్లాకీ అని కూడా పిలుస్తారు.
ఆఖరి క్షణం వరకు బాధ్యతగా..
జిల్లా శునక దళానికే.. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా వ్యవహరించిన జూడో ఆఖరి క్షణం వరకు తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. గవర్నర్ విచ్చేస్తున్న మార్గంలో తనిఖీలు నిర్వహించేందుకు వెళ్లిన బ్లాకీ.. గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. అధిక రక్తపోటే గుండెపోటుకు దారి తీసినట్లు పోస్ట్‌మార్టంలో తేలింది.
ఆ సమయంలో జూడోను పర్యవేక్షిస్తున్న విష్ణు నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగి ఉండవచ్చని అనుమానిస్తూ.. విచారణ చేపట్టి అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉన్నతాధికారులు.
వీవీఐపీ పర్యటనల్లో..
జూడో అనేక వీవీఐపీ కార్యక్రమాల్లో విధులు నిర్వర్తించింది. డచ్ దేశ రాజు, కేరళ గవర్నర్ అరీఫ్ మొహమ్మద్ ఖాన్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, సీనీ హీరో అల్లు అర్జున్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వంటి ప్రముఖులు జిల్లాకు వచ్చినప్పడు తనీఖీలు నిర్వహించింది జూడో.
ఇదీ చదవండి:మహా 'సర్కార్'లో ఎన్సీపీకే పెద్ద పీట.. అజిత్‌కు ఆర్థికం