ETV Bharat / bharat

20 అడుగుల 'నమస్తే ట్రంప్​' త్రీడీ రంగోలి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా 20 అడుగుల త్రీడీ చిత్రాన్ని రూపొందించారు గుజరాత్​ కళాకారులు. మోటేరా స్టేడియం, ట్రంప్​-మోదీ చిత్రాలను గీశారు. 15 గంటలు శ్రమించి ఈ రంగోలిని పూర్తి చేశారు.

surat-artists-draw-3d-painting-to-commemorate-namaste-trump
20 అడుగుల 'నమస్తే ట్రంప్​' త్రీడీ రంగోలి
author img

By

Published : Feb 23, 2020, 7:57 AM IST

Updated : Mar 2, 2020, 6:33 AM IST

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్​లో తొలిసారి పర్యటిస్తున్న సందర్భంగా ప్రత్యేక త్రీడీ చిత్రాన్ని రూపొందించారు గుజరాత్​ సూరత్​కు చెందిన కళాకారులు. మోటేరా స్టేడియంలో ట్రంప్ పాల్గొనే కార్యక్రమానికి గుర్తుగా 20 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు ఉన్న 'నమస్తే ట్రంప్'​ రంగోలిని గీశారు. అందులో ప్రధాని నరేంద్ర, ట్రంప్ చిత్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

ఈ పెయింటింగ్ కోసం 12 రంగులను వినియోగించి 15 గంటలపాటు శ్రమించారు కళాకారులు. ట్రంప్​కు స్వాగతం పలికేందుకే దీన్ని రూపొందించినట్లు చెప్పారు.

' మోటేరా స్టేడియంతో పాటు మోదీ, ట్రంప్​ల త్రీడీ పెయింటింగ్​ను రూపొందించాం. అగ్రరాజ్యం అధ్యక్షునికి స్వాగతం పలికేందుకు దీనిని గీశాం'

-అంజలి సోలంకి, కాళాకారిణి.

మోటేరా స్టేడియంలో జరిగే నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరు కాలేని అనేక మంది ఔత్సాహికులను ఈ త్రీడీ పెయింటింగ్ విశేషంగా ఆకర్షిస్తోంది.

20 అడుగుల 'నమస్తే ట్రంప్​' త్రీడీ రంగోలి

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: ఆ మూడు నగరాల్లో భద్రత కట్టుదిట్టం

Last Updated : Mar 2, 2020, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.