ETV Bharat / bharat

రజనీకాంత్​ రాజకీయాల్లోకి రావట్లేదని అభిమాని మృతి! - రజనీకాంత్​ రాజకీయాల్లోకి రావాలని నిప్పంటించుకున్న అభిమాని

రాజకీయాల్లోకి రాలేనని సూపర్​స్టార్​ రజనీకాంత్​ ప్రకటించడం ఆయన అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఒక అభిమాని ఇంట్లో అనుమానస్పదంగా మృతి చెందగా.. మరో అభిమాని రజనీ నివాసానికి దగ్గరలో ఒంటికి నిప్పంటించుకున్నాడు.

super star rajanikanth fan died, another set fir himself
నటుడు రజనీకాంత్​ రాజకీయల్లోకి రాలేదని అభిమాని మృతి
author img

By

Published : Jan 1, 2021, 1:59 PM IST

ఆరోగ్య పరిస్థితుల దృష్య్టా తాను రాజకీయాల్లోకి రాలేనని రజనీకాంత్​ ప్రకటించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని విల్లుపురం జిల్లా, పానంపట్టు గ్రామానికి చెందిన రాజ్​కుమార్​ అనే అభిమాని గురువారం(డిసెంబర్​31) చనిపోయాడు.

రజనీకాంత్​ రాజకీయాల్లోకి రావడం లేదనే ప్రకటనతో రాజ్​కుమార్ తీవ్రమనస్తాపం చెందాడని స్థానికులు తెలిపారు. ఫేస్​బుక్​లో ఇదే తన చివరి రోజని పేర్కొన్నాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి తన ఇంటికెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజున చూసే సరికి చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

అయితే మృతికి గల కారణాలు తెలియలేదని పేర్కొన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నిప్పంటించుకున్న అభిమాని..

రజనీకాంత్​ రాజకీయాల్లోకి రావాలని కొందరు అభిమానులు చెన్నైలోని పోయోస్ గార్డెన్​లో ఉండే తలైవా నివాసం సమీపంలో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో మురుగేశన్​ అనే అభిమాని తన శరీరానికి నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు మంటలార్పి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతను చిక్సిత పొందుతున్నాడని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రజనీ వెనక్కి తగ్గడానికి కారణాలివేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.