విద్యార్థిలోకమంతా ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం శ్రమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగితే సత్ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఇటీవల ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీం ఇండియాను ఇందుకు ఉదహరించారు.
అసోం తేజ్‌పుర్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మోదీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 75 ఏళ్లు అవుతుందని తెలిపారు. దేశ స్వేచ్ఛ కోసం అసోం ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. నవ భారత్ నిర్మాణంలో భాగంగా ఆత్మనిర్బర్ సాధన దిశగా ఇప్పుడు యువత ముందుకుసాగాలని సూచించారు.
ఇదీ చూడండి: రైతుల పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటోంది: సోనియా