గల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణలో 20 మంది సైనికులు అమరులయ్యారు. అయితే, దాడి సమయంలో ఇరువైపులా సైన్యం ఎటువంటి తుపాకులు ఉపయోగించనప్పటికీ, చైనా సైనికులు ఇనుప చువ్వలు బిగించిన ఇనుప రాడ్లతో దాడిచేసినట్లు తేలింది. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన ఇనుప చువ్వలను వెల్డింగ్ చేసి ఉన్న ఫొటోలను తాజాగా ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్ శుక్లా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. గల్వాన్ ఘర్షణ జరిగిన ప్రాంతంలో భారత సైనికులు ఈ ఫొటోలు తీసినట్లు తెలిపారు.
నేరపూరిత చర్య
కర్నల్‌గా సేవలందించిన అజయ్ శుక్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్నో విషయాలను ఇదివరకు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అనాగరిక చర్యను తీవ్రంగా ఖండించిన శుక్లా, ఇది సైనికచర్య కాదని నేరపూరిత చర్యగా అభివర్ణించారు. అయితే, ఇనుప చువ్వలు వెల్డింగ్ చేసివున్న దృశ్యాలు చూస్తుంటే చైనా పక్కా ప్రణాళికతోనే భారత సైన్యంపై ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
ఇదీ చూడండి: దేశంలో 24 గంటల్లో 13,586 కరోనా కేసులు