ఝార్ఖండ్లో విషాదం జరిగింది. కొదెర్మా జిల్లాలోని మైకా గని పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు విగత జీవులుగా మారారు. ఇద్దరి మృత దేహాలను వెలికితీసినట్లు అధికారులు చెప్పారు. మిగతా మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.