ETV Bharat / bharat

'1975 ఎమర్జెన్సీ'పై సుప్రీంలో 94 ఏళ్ల వృద్ధురాలి పిటిషన్​ - 94 ఏళ్ల వృద్ధురాలు వీణా సారిన్

1975లో 'రాజ్యాంగ విరుద్ధంగా' ఎమర్జెన్సీ విధించారని సుప్రీంకోర్టులో ఓ 94 ఏళ్ల వృద్ధురాలు పిటిషన్​ దాఖలు చేశారు. దానివల్ల తమ కుటుంబంలోని మూడు తరాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని పేర్కొన్నారు. పరిహారంగా రూ.25 కోట్లు చెల్లించాలని డిమాండ్​ చేశారు. దీనిపై డిసెంబర్​ 7న విచారణ చేపట్టనుంది అత్యున్నత న్యాయస్థానం.

sc to hear 94 yr olds plea to declare emergency unconstitutional on dec 7
ఎమర్జెన్సీపై సుప్రీంలో.. 94 ఏళ్ల వృద్ధురాలి పిటిషన్​
author img

By

Published : Dec 6, 2020, 6:42 AM IST

1975లో ఎమర్జెన్సీ విధించడాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఓ 94 ఏళ్ల వృద్ధురాలు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఎమర్జెన్సీ వల్ల నష్టపోయిన తనకు పరిహారంగా రూ.25కోట్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

దిల్లీకి చెందిన వీణా సారిన్​ అనే వృద్ధురాలు ఈ పిటిషన్​ వేశారు. దీనిపై జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ దినేశ్​ మహేశ్వరి, జస్టిస్​ హరిషికేశ్​ రాయ్​లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. సోమవారం విచారణ చేపట్టనుంది. 1975లో విధించిన ఎమర్జెన్సీ కాలంలో తమపై జరిగిన దాడుల నుంచి కోలుకోవడానికి ఒక జీవితకాలం పట్టిందని తన అభ్యర్థనలో వీణా పేర్కొన్నారు. తమను జైల్లో వేస్తారనే భయంతో దేశాన్ని వదిలి వెళ్లాలనుకున్నామని చెప్పారు. ప్రభుత్వాధికారులు తమ ఇష్టానుసారం ప్రజల హక్కులకు భంగం కల్పించారని అన్నారు.

"దిల్లీలోని కారోల్​బాగ్​లో నా భర్త నిర్వహించే బంగారం దుకాణాన్ని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 25 ఏళ్లు కష్టపడి నా భర్త ఆ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు మమ్మల్ని బెదిరించి, మా విలువైన ఆస్తులను లాక్కున్నారు. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని భయం మధ్య గడిపేలా చేశారు"

--- వీణా సారిన్​

ఎమర్జెన్సీ వల్ల ఒత్తిడితో తన భర్త ప్రాణాలు కోల్పోయారని వీణా సారిన్​​​ తన పిటిషన్​లో పేర్కొన్నారు. అప్పటినుంచి తాను ఒంటరిగా బతుకు వెళ్లదీస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తన కుమార్తెతో కలిసి దెేహ్రాదూన్​లో ఉంటున్నానని తెలిపారు.

తనకు పరిహారం చెల్లించాలని కోరుతూ తొలుత 2014 డిసెంబర్​లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు వీణా సారిన్​​. 2020 జులై 28న తీర్పును ఇచ్చిన దిల్లీ హైకోర్టు.. వీణా కోల్పోయిన స్థిరాస్తులను చెల్లించాలని అధికారులను ఆదేశించింది. అయితే.. తాము కోల్పోయిన చరాస్తులకు మాత్రం పరిహారం దక్కలేదని తాజాగా సుప్రీం కోర్టులో ఆమె ఈ పిటిషన్​ దాఖలు చేశారు.

ఇదీ చూడండి:తేజస్వీ సహా 18 మందిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.