ETV Bharat / bharat

గహ్లోత్​ నాయకత్వానికే​ మా పూర్తి మద్దతు: సీఎల్​పీ - సచిన్​ పైలట్​

అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్​ శాసనసభా పక్ష సమావేశం తీర్మానించింది. దీనితో పాటు పార్టీని బలహీనపరిచే విధంగా ప్రవర్తించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించింది.

గహ్లోత్​ నాయకత్వానికే​ మా పూర్తి మద్దతు: సీఎల్​పీ

author img

By

Published : Jul 13, 2020, 5:45 PM IST

Updated : Jul 13, 2020, 6:46 PM IST

రాజస్థాన్​ రాజకీయాలు క్షణక్షణానికి మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఓవైపు రెబల్​ నేత సచిన్​ పైలట్​ను బుజ్జగిస్తూనే.. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​కు అనుకూలంగా కాంగ్రెస్​ వ్యవహరిస్తోంది. ఈ మేరకు సోమవారం జరిగిన కాంగ్రెస్​ శాసనసభా పక్ష(సీఎల్​పీ)సమావేశంలో.. గహ్లోత్​ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఓ తీర్మానాన్ని ఆమోదించారు నేతలు.

"కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేతలు రాహుల్​, ప్రియాంక గాంధీలపై సీఎల్​పీ పూర్తి విశ్వాసంతో ఉంది. ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ నేతృత్వంలోని ప్రభుత్వానికి సీఎల్​పీ ఏకగ్రీవంగా మద్దతిస్తోంది."

-- సీఎల్​పీ తీర్మానం

ఇదీ చూడండి:- సచిన్ 'పవర్​ ప్లే': రంగంలోకి రాహుల్​, ప్రియాంక!

పార్టీని బలహీనపరిచే విధంగా ప్రవర్తించే ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని సీఎల్​పీ సూచించింది.

"పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరిచే విధంగా జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను సీఎల్​పీ ఖండిస్తోంది. ఈ విధమైన చర్యలకు ప్రత్యక్షంగానైనా.. పరోక్షంగానైనా పాల్పడే వారిపై.. క్రమశిక్షణా చర్యలు చేపట్టాల్సిందే."

--- సీఎల్​పీ.

ఆ నోటీసులే కారణమా?

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో సచిన్‌ పైలట్‌కు ఇటీవల స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ) పోలీసుల నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. ఈ నోటీసే సచిన్‌ను తీవ్ర అసంతృప్తికి గురిచేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి సచిన్​.. కాంగ్రెస్​ సభ్యులకు దూరంగా ఉన్నారు. సచిన్​ భాజపాలో చేరతారని ఊహాగానాలు జోరందుకున్నాయి.

ఇవీ చూడండి:-

Last Updated : Jul 13, 2020, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.