ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి 2 రైళ్లు మినహా మిగతా అన్ని రైళ్ళ రాకపోకలు ఆదివారం నుంచి యథావిధిగా నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే చెన్నై-హౌరా ప్రధాన లైన్లను పునరుద్ధరించింది ఈస్ట్ కోస్ట్ రైల్వే మండలి.
ఫొని తుపాను బీభత్సం సృష్టించిన 24 గంటల్లోనే సేవలు పునరుద్ధరించామని రైల్వేఅధికారి జే.పీ. మిశ్రా అన్నారు.
ఫొని తుపాను ధాటికి పూరీ రైల్వే స్టేషన్ భారీగా ధ్వంసమైనందున మే 10 వరకు పూరీ నుంచి సేవలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
- ఇదీ చూడండి: మోదీ గుజరాత్ ప్రసంగంపై ఈసీ క్లీన్ చిట్