కేంద్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ విమర్శల బాణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సౌర్ విద్యుత్ ప్రాజెక్టు విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాహుల్. మధ్యప్రదేశ్‌లోని రేవా సోలార్ పార్క్.. ఆసియాలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ ప్రాజెక్ట్ అని మోదీ అన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. "అసత్యాగ్రహి" అని హిందీలో ట్వీట్ చేశారు. సత్యం కోసం జరుగుతున్న పోరాటాన్ని విశ్వసించని వారిని అసత్యాగ్రహి అంటారు.
-
असत्याग्रही! https://t.co/KL4aB5t149
— Rahul Gandhi (@RahulGandhi) July 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">असत्याग्रही! https://t.co/KL4aB5t149
— Rahul Gandhi (@RahulGandhi) July 11, 2020असत्याग्रही! https://t.co/KL4aB5t149
— Rahul Gandhi (@RahulGandhi) July 11, 2020
శుక్రవారం.. మధ్యప్రదేశ్‌లోని రేవాలో సౌర విద్యుత్ పార్క్‌ను ప్రారంభించారు మోదీ. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ఆసియాలోనే అతిపెద్దది అని పేర్కొన్నారు.
ఇదే విషయంపై కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్.. కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.
"కర్ణాటకలోని పావగడ సోలార్ పార్క్ సామర్థ్యం 2,000 మెగా వాట్లు. మధ్యప్రదేశ్‌లోని రేవా సౌర విద్యుత్ పార్కు సామర్థ్యం కేవలం 750 మెగా వాట్లు. అలాంటప్పుడు.. రేవాలోని సౌర విద్యుత్ పార్కు ఆసియాలోనే అతిపెద్దదని కేంద్రం ఎలా అనగలదు? దీనిపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి స్పష్టతనివ్వాలి."
--- డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత.