భారత వాయుసేన అమ్ముల పొదిలో విధ్వంసక యుద్ధ విమానాలు 'రఫేల్' అధికారికంగా చేరాయి. అంబాలా వైమానిక స్థావరంలో భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఫ్లోరెన్స్ పార్లీ సమక్షంలో 17వ స్క్వాడ్రన్ 'గోల్డెన్ యారోస్'కు రఫేల్‌ను అప్పగించింది రక్షణ శాఖ.
వాయుసేనకు రఫేల్ యుద్ధ విమానాలు అప్పగించేందుకు అంబాలా ఎయిర్‌బేస్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది రక్షణ శాఖ. దీనికి రాజ్‌నాథ్ సింగ్, ఫ్లోరెన్స్ పార్లీ, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, వాయుసేన సారథి రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రఫేల్‌కు పూజలు...
సంప్రదాయ పద్ధతిలో రఫేల్ విమానాలకు 'సర్వ ధర్మ పూజ' చేశారు.
రాజ్‌నాథ్‌తో పార్లీ భేటీ..
రఫేల్ యుద్ధ విమానాలు అధికారికంగా వైమానదళంలోకి చేరే కార్యక్రమానికి హాజరయ్యే ముందు పార్లీతో భేటీ అయ్యారు రాజ్‌నాథ్ సింగ్. పాలమ్ వాయుసేన కేంద్రంలో ఇరువురు సమావేశంపై పలు అంశాలపై చర్చించినట్లు రక్షణ శాఖ కార్యాలయం తెలిపింది.
నాలుగు సంవత్సరాల క్రితం భారత్, ఫ్రాన్స్‌కు మధ్య 36 రఫేల్ విమనాల కోసం ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం విలువ రూ.59,000 కోట్లు. ఆ విమానాల తయారీ బాధ్యతను ఆ దేశానికి చెందిన ఏరోస్పేస్ సంస్థ దసో ఏవియేషన్ తీసుకుంది. దానిలో భాగంగా మొదటి బ్యాచ్‌కు చెందిన ఐదు విమానాలు జులై 29న పంజాబ్‌లోని అంబాలాకు చేరుకున్నాయి.
ఇదీ చూడండి: రఫేల్ ఎంట్రీకి ముందు ఫ్రాన్స్ కీలక వ్యాఖ్యలు