ETV Bharat / bharat

'రఫేల్'​ రివ్యూ పిటిషన్లపై నిర్ణయం వాయిదా

రఫేల్​ తీర్పును పునఃసమీక్షించాలని దాఖలైన వ్యాజ్యాలపై నిర్ణయాన్ని సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. డిసెంబర్​ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్​ సిన్హా, అరుణ్​ శౌరీ, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వులో ఉంచింది.

author img

By

Published : May 10, 2019, 8:17 PM IST

Updated : May 10, 2019, 10:46 PM IST

'రఫేల్'​ రివ్యూ పిటిషన్లపై నిర్ణయం వాయిదా
'రఫేల్'​ రివ్యూ పిటిషన్లపై నిర్ణయం వాయిదా

రఫేల్​ ఒప్పందంపై తీర్పును సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్​ సిన్హా, అరుణ్​ శౌరీలు, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయాన్ని వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అత్యున్నత న్యాయస్థానంలో ఈ అంశంపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని గతేడాది డిసెంబర్​ 14న తీర్పు వెలువరించింది కోర్టు. ఈ తీర్పును సవాల్​ చేస్తూ సిన్హా, శౌరీ, భూషణ్​లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రఫేల్​ ఒప్పంద వ్యవహారంపై కేంద్రం... కోర్టును తప్పుదోవ పట్టిస్తుందని అఫిడవిట్​లో పేర్కొన్నారు పిటిషనర్లు. బదులుగా కేంద్రం కోర్టుకు ప్రమాణపత్రం సమర్పించింది.

రివ్యూ పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి సూచించగా.. అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ ఈ నెల 4న ప్రమాణపత్రం సమర్పించారు.

నేడు అఫిడవిట్​ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం అందరి వాదనలు విన్న అనంతరం నిర్ణయం వాయిదా వేసింది.

ఒప్పందం వెనుక రహస్యాలు...

రఫేల్​ పత్రాల మాయం దగ్గరనుంచి.. ఒప్పందంలో ఎన్నో కోణాలు దాగున్నాయని వాదనలు వినిపించారు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. ఈ అంశంలో ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి క్రిమినల్​ విచారణ జరిపించాలని కోరారు.

ప్రధాని కార్యాలయం రఫేల్​ వ్యవహారంపై సంప్రదింపులు జరిపిందని, ముగ్గురు సభ్యులతో కూడిన భారత ప్రతినిధుల బృందం ఇలా చేయడాన్ని తప్పుబట్టిందని గుర్తుచేశారు.

అవే వాదనలు...

కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​... రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని అభ్యర్థించారు. ప్రధాన పిటిషన్​కు, రివ్యూ పిటిషన్​కు పెద్ద మార్పులేమీ లేవని కోర్టుకు తెలిపారు. అవే వాదనలు వినిపిస్తున్నారని పేర్కొన్నారు వేణుగోపాల్​.

ఇంతకుముందు చెప్పినట్లే.. ఇది భారత్​-ఫ్రాన్స్​ రక్షణశాఖకు సంబంధించిన వ్యవహారమని, ఒప్పంద అంశాలు బహిర్గతం చేయలేమని కోర్టుకు తెలిపారు ఏజీ.

వీరందరి వాదనలు విన్న సుప్రీంకోర్టు... తీర్పును రిజర్వులో ఉంచింది.

ఇదీ చూడండి:

కేంద్రానికి ఊరట... రఫేల్ కేసు వాయిదా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
MEDITERRANEA HANDOUT – AP CLIENTS ONLY
At sea, off the coast of Lampedusa - 9 May 2019
1. Various of rescued migrants under blankets on main deck of Mediterranea rescue ship Mare Jonio
MEDITERRANEA HANDOUT – AP CLIENTS ONLY
At sea, off the coast of Lampedusa - 10 May 2019
2. Italian border police approaching Mare Jonio rescue ship
MEDITERRANEA HANDOUT – AP CLIENTS ONLY
Lampedusa - 10 May 2019
3. Mare Jonio docking in Lampedusa
4. Migrants disembarking from Mare Jonio
STORYLINE:
The Italian rescue ship Mare Jonio docked in Lampedusa port on Friday morning, a day after it rescued 30 migrants from the Mediterranean sea.
A pregnant woman and a one-year-old infant were among those who were rescued.
Mare Jonio, currently the only civil rescue ship present in central Mediterranean Sea, is run by the humanitarian group, Mediterranea.
The rescue ship was escorted by Italian authorities to Lampedusa.
Italian anti-migrant Deputy Prime Minister and Interior Minister Matteo Salvini announced on his official twitter account that he would block and seize the ship.
Mediterranea insisted that there were no legal grounds to impound the ship and they had followed the maritime law when rescue efforts were made 40 miles  (64 kilometres) from the Libyan coast.
The Italy's populist government had been trying to shut down such operations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 10, 2019, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.