ETV Bharat / bharat

పబ్​జీకి బానిసై 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య

author img

By

Published : Oct 28, 2020, 11:53 AM IST

తమిళనాడులో ఓ 14 ఏళ్ల బాలుడు పబ్​జీ ఆడలేననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పబ్​జీకి బానిసైన ఈ బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

Tamil Nadu boy kill himself for pubg
పబ్​జీకి బానిసై బాలుడి ఆత్మహత్య

ఆన్​లైన్ గేమ్​ పబ్​జీకి మరో ప్రాణం బలైంది. పబ్​జీ ఆడలేననే మనస్తాపంతో 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో జరిగింది.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కోయంబత్తూర్​ జిల్లా సులుర్​కు చెందిన 14 ఏళ్ల బాలుడు చెన్నైలో 9వ తరగతి చదువుతున్నాడు. అతడికి తరచూ పబ్​జీ ఆడటం అలావాటు. ఈ విషయం గమనించిన తల్లిడండ్రులు ఎక్కువ సేపు గేమ్ ఆడటం మంచిది కాదని హెచ్చరించారు. అయినా వారి మాట లేక్కచేయకుండా పబ్​జీకి బానిసైపోయాడు ఆ బాలుడు.

అతడికి రెండు నెలల నుంచి మానసిక ఆస్పత్రిలో చికిత్స ఇప్పిస్తున్నారు తల్లిండ్రులు. అయితే ఇకపై పబ్​జీ ఆడలేననే మనస్తాపానికి గురైన ఆ బాలుడు.. ఎవరూ లేని సమయం చూసి మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తల్లిడండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చూడండి:వైరల్​: అగ్ని గుండంలో పాపం పసివాడు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.