భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం లద్దాఖ్‌లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నిము ప్రాంతంలో జవాన్లతో జరిగిన సమావేశం అనంతరం.. సింధూ నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ పురోగతి, శాంతి, శ్రేయస్సు కోసం ప్రార్థించినట్టు తెలిపిన ప్రధాని.. ఇందుకు సంబంధించిన చిత్రాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
లద్దాఖ్ పర్యటనలో భాగంగా.. గల్వాన్ లోయలో వీరమరణం పొందిన 20మంది జవాన్లకు నివాళులర్పించిన మోదీ.. ఘర్షణలో గాయపడిన సైనికుల్ని పరామర్శించారు.
ఇదీ చదవండి: 'ఆ మాటలు 130 కోట్ల మంది భారతీయులకు ధైర్యం'