'మనసులో మాట' కార్యక్రమంతో దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో దగ్గరయ్యారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. నాలుగు నెలల విరామం తర్వాత నేడు మోదీ 'మన్-కీ-బాత్' పునఃప్రారంభం కానుంది.
మోదీ రెండోసారి భారతదేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 'మనసులో మాట' కార్యక్రమం జరగనుండటం ఇదే తొలిసారి.
నెలలో జరిగిన విశేషాలు, వాటిపై తన అభిప్రాయాలను, సూచనలను ఈ కార్యక్రమంలో మోదీ పంచుకుంటారు. ప్రతి నెల చివరి ఆదివారం 'మనసులో మాట' ప్రసారమవుతుంది.
ఇదీ చూడండి: వచ్చే జూన్ నాటికి 'ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు'