ETV Bharat / bharat

ఆ ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ - Modi latest news

వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్​గా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వరద పరిస్థితులు, నైరుతి రుతుపవనాలను ఎదుర్కొనే సన్నద్ధతపై సమీక్షించారు.

PM holds meeting with CMs of six states
ఆ ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ
author img

By

Published : Aug 10, 2020, 4:21 PM IST

దేశంలోని పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాలైన అసోం, బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులతో వర్చువల్​గా సమావేశమయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో వరదల పరిస్థితులు, నైరుతి రుతుపవనాలను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై సమీక్షించారు.

వర్ష సూచన, హెచ్చరిక వ్యవస్థను మెరుగుపరచడానికి అధునాత సాంకేతికత పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ప్రధాని మోదీ. అలాగే వరదలను అంచనా వేసేందుకు శాశ్వత వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్రాల సంస్థల మధ్య మంచి సమన్వయం అవసరమని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రస్తుత వరద పరిస్థితులు, సహాయక చర్యలు, ముందు ముందు ఎదుర్యయే సమస్యలను ఎదుర్కొనే సన్నద్ధత గురించి ప్రధానికి వివరించారు ముఖ్యమంత్రులు. ప్రజలను రక్షించేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​), కేంద్ర సంస్థల కృషిని అభినందించారు.

ఇదీ చూడండి: సచిన్ పైలట్​ యూటర్న్- రాహుల్​తో చర్చలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.