తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన వెంకయ్య.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
రైలు ప్రమాదంలో దుర్మరణం చెందిన వలస కార్మికులకు ప్రధాని సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తీవ్ర వేదనకు గురిచేసిందని ట్వీట్ చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
''మహారాష్ట్రలో ఔరంగాబాద్ రైలు ప్రమాద ఘటన తీవ్ర వేదనకు గురిచేసింది. వలస కూలీలు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. రైల్వే మంత్రి పీయూల్ గోయల్‌తో మాట్లాడా. ఆయన దగ్గరుండి సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం.''
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి