ETV Bharat / bharat

పీఎం కేర్స్​ నిధులు దేనికి వాడుతున్నారంటే..? - pm care trust fund allocated for coronavirus crisis

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్​లోని​ నిధులను ఖర్చు చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు రూ.3,100 కోట్లను ఎందుకు వాడుతున్నారో వెల్లడించింది ప్రధానమంత్రి కార్యాలయం.

PM CARES Fund Trust allocates Rs 3100 crore for fight against Covid-19
పీఎం కేర్స్​ నిధులు ఎందుకు వాడతారంటే..?
author img

By

Published : May 13, 2020, 9:27 PM IST

Updated : May 13, 2020, 9:37 PM IST

పీఎం కేర్స్​ ఫండ్​లోని రూ.3,100 కోట్లను కరోనాపై పోరుకు ఉపయోగించనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టతనిచ్చింది. ఇందులోని రూ.2వేల కోట్లు వెంటిలేటర్ల కొనుగోళ్లకు, వేయి కోట్లు వలస కూలీల కోసం ఉపయోగించనున్నారు. మరో రూ.100 కోట్లను వ్యాక్సిన్​ అభివృద్ధికి వినియోగించనున్నారు.

కొవిడ్‌-19 బాధితులకు అండగా ఉండాలనే సదుద్దేశంతో.. మార్చి 27న "ప్రైమ్ మినిస్టర్స్​ సిటిజెన్ అసిస్టెన్స్​ అండ్ రిలీఫ్​ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్​ ఫండ్​" (పీఎం కేర్స్) పేరిట నిధిని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇందులో రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి.. కీలక సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికీ ఈ కేర్స్​కు.. పారిశ్రామికవేత్తలు, సంస్థలు, ప్రజల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి.

ఇదీ చూడండి: కరోనా ఆర్థిక ప్యాకేజీ తొలిరోజు ముఖ్యాంశాలు ఇవే!

Last Updated : May 13, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.