ETV Bharat / bharat

'ప్రతి జిల్లాలో అవినీతి నిరోధక కోర్టు' - అవినీతి నిరోధకంపై సుప్రీలో పిల్​

అర్థిక నేరాల సత్వర విచారణకు ప్రతి జిల్లాలో ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిల్​ దాఖలైంది.

అవినీతి నిరోధక న్యాయస్థానాల ఏర్పాటుకు సుప్రీంలో పిల్​
PIL in SC to establish Special Anti-Corruption Courts in every district
author img

By

Published : Dec 21, 2020, 1:19 PM IST

మనీలాండరింగ్​, పన్ను ఎగవేత వంటి ఆర్థిక నేరాల విచారణ ఒక సంవత్సరంలోపు పూర్తి చేసేలా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక అవినీతి నిరోధక న్యాయస్థానం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిల్​ దాఖలైంది. భాజపా నేత, న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ ఈ వ్యాజ్యం వేశారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులపై తగిన చర్యలు తీసుకునేలా హైకోర్టులకు దిశానిర్దేశం చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

అవినీతి నిరోధక చట్టాల్లో లోపాలు, కేసుల సాగదీత వల్ల అవినీతి నిరోధక ఇండెక్స్​లో భారత్​ ఇప్పటివరకు 50వ స్థానంలోపు ఒక్కసారి కూడా రాలేదని న్యాయవాది అశ్వినీ కుమార్​ వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిని నిర్మూలన దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.